ఇంతకాలం… అమరావతిని అనాధగా వదిలేస్తున్నారు.. అమరావతి కూడా ఆంధ్రలో భాగమే అన్న విషయం మరుస్తున్నారు.. అమరావతి రైతులు కూడా ఆంధ్రులే అన్న విషయం గుర్తుంచుకొవడం లేదు.. ఇప్పటికే మొదలెట్టి అరకొర పనులూతో ఆపిన బిల్డింగులను అనాదలుగా వదిలేస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేసిన విమర్శలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం!
ఇంతకాలం అమరావతి పేరుచెప్పి ప్రభుత్వంపై రకరకాల ఆరోపణలు చేసిన ప్రతిపక్షాలకు సరైన సమాధానం చెప్పారు ఏపీ మంత్రి బొత్సా సత్యనారాయణ. అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం తమకున్న బాధ్యతల్లో అతిముఖ్యమైనదన్న విషయం జగన్ చెప్పారని తెలిపిన బొత్స… అమరావతిలో బాబు అర్ధాంతరంగా వదిలేసిన భవనాల నిర్మాణాలు పూర్తి చేస్తామని తెలిపారు.
ఇక ఆ పనులు పూర్తి చేయడానికి ఎంత ఖర్చవుతుంది.. ఎంతవరకూ ఖర్చుపెట్టొచ్చు.. అప్పులు చేయకుండా ఎలా పనులుపూర్తి చేయాలి అన్న ఆలోచనలు చేస్తున్నామని బొత్స తెలిపారు. అనంతరం కాస్త వాయిస్ పెంచిన బొత్సా… గవర్నర్ ఆమోదం తెలిపిన వెంటనే విశాఖలో శంకుస్థాపన పనులు మొదలెడదామనుకున్నామని.. కాని టీడీపీ వంటి దుష్ట శక్తులు అడ్డుకున్నాయని.. సరే ముహూర్తం ఎప్పుడనేది కాలమే నిర్ణయిస్తుంది కానీ.. మా కమిట్ మెంట్ అయితే ఫిక్స్ అని బొత్సా క్లారిటీ ఇచ్చారు!!