డిజాస్టర్ గా మిగిలిపోయిన రజినీకాంత్ ఆ చిత్రం రీ రిలీజ్ కానుందా..

-

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలోనే ఓ శుభవార్త చెప్పనున్నట్టు తెలుస్తోంది ఆయన క్రేజీ మూవీ ఒకటి రీరిలీజ్ కు సిద్ధమవుతున్నట్టు సమాచారం..

సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఉన్న క్రేజ్ కోసం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటేనే అభిమానుల్లో ఒక రకమైన ఆసక్తి ఏర్పడుతుంది సినిమా హిట్ అయిన ఫ్లాఫ్ అయినా దానికి అతీతంగా అభిమానులు ఆదరిస్తూ ఉంటారు.. రజనీకాంత్ ఉన్నాడు అంటే చాలు ఆ సినిమాకు విపరీతమైన క్రేజ్ ఏర్పడుతుంది.. అయితే ప్రస్తుతం ఆయన నటించిన ఓ చిత్రం విడుదలై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన పుట్టినరోజున ఆ చిత్రాన్ని విడుదల చేయనున్నారని సమాచారం.. ఇంతకీ ఆ చిత్రం ఏమిటంటే బాబా..

బాబా చిత్రాన్ని సురేష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించారు.. అయితే రజనీకాంత్ జీవితానికి దగ్గరగా ఉన్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.. అయితే ప్రస్తుతం ఈ సినిమా కొత్త వెర్షన్ ను విడుదల చేయనున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా బాబా చిత్రంలోని పాటలను డోల్బీ మిక్స్ సౌండ్‌తో రీమాస్టర్డ్‌ వెర్షన్‌ సిద్దం చేస్తున్నట్టు సమాచారం.. అలాగే ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా బెస్ట్ క్వాలిటీతో ఈ సినిమాను రీఎడిట్‌ చేస్తున్నట్టు కోలీవుడ్ సర్కిల్ టాక్‌. బాబా సినిమాకు సూపర్ స్టార్ రజినీకాంత్ స్వయంగా కథ-స్క్రీన్‌ ప్లే అందించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించారు. అప్పట్లో బాబా నష్టాలను పూడ్చేందుకు డిస్ట్రిబ్యూటర్లకు పెట్టుబడిలో 25 శాతాన్ని తిరిగిచ్చారు రజినీకాంత్‌. అయితే ఈ విషయంలో రజనీకాంత్ ను ఆకాశానికి ఎత్తేసారు తమిళ అభిమానులు అతను మంచి మనసును ఇప్పటికీ ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకున్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version