ఈ సారి సంక్రాంతి సినిమాల రిలీజ్ పెద్ద పజిల్ లా ఉంది. ఈ సంక్రాంతికి బాలయ్య బాబు వీర సింహ రెడ్డి గా, చిరంజీవి వాల్తేరు వీరయ్య గా వస్తున్నారు. ఈ రెండు సినిమాలు నిర్మించింది మైత్రీ మూవీస్ మేకర్స్ వారు. ఇప్పుడు ఈ రెండూ సినిమాలకు థియేటర్స్ కోసమే పెద్ద యుద్దం జరిగే అవకాశం ఉంది. దీనిలో దిల్ రాజు డబ్బింగ్ సినిమా చేరి విషయాన్ని ఇంకా జఠిలం చేసింది.
గత సంక్రాంతి బరిలో డబ్బింగ్ సినిమాలను ఆడనివ్వమని తెలుగు సినిమాలకు ప్రాధాన్యతనిచ్చాకే ప్రాధాన్యతా క్రమంలో చివరిలో అనువాద చిత్రాలకు థియేటర్లు ఇచ్చేలా నిర్మాతలు నిర్ణయించారు. దీంతో దానిని 2023 సంక్రాంతికి కూడా ఇదే ఉండాలని ఛాంబర్ పెద్దలు కూడా అధికారికంగా నోటీస్ పంపారు. దీనితో దిల్ రాజు విజయ్ తో తమిళంలో తీస్తున్న డబ్బింగ్ సినిమా వారసుడు ఆగే పరిస్థితి ఏర్పడింది.
దీనిపై సీనియర్ నిర్మాత అశ్వినీదత్ దత్ సంచలన కామెంట్స్ చేసారు. ప్రస్తుతం తమిళంలో కూడా మన సినిమాలు మంచి వసూళ్లని సాధిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో డబ్బింగ్ సినిమాలకు థియేటర్స్ ఇవ్వొద్దని ఎలా అంటారు. ఇది తెలుగు సినిమాకు మంచిది కాదు. ఒక తెలుగు నిర్మాత, తెలుగు దర్శకుడితో సినిమా చేశారు. దాన్ని సంక్రాంతికి విడుదల చేసుకుంటే తప్పేముంది? మరో నిర్మాత మాత్రం ఒకేసారి తన రెండు సినిమాలు విడుదల చేసుకోవచ్చా? థియేటర్ల ప్రాబ్లం వస్తుందని తెలుసు కదా, రెండు ఒకే సారి రిలీజ్ ఎందుకు పెట్టుకున్నారు, మీరు ఆ నిర్మాతకు చెప్పాలి కదా, ఈ విషయం లో నిర్మాతల మండలి నిర్ణయం నాకు నచ్చలేదు అని సంచలన కామెంట్స్ చేసారు.