వైసీపీ పోలిటికల్ గేమ్..ట్రాప్‌లో పడతారా?

-

పోలిటికల్ గేమ్‌లో అధికార వైసీపీ ఎప్పుడు ముందే ఉంటుందని చెప్పవచ్చు. రాజకీయ వ్యూహాలు వేసి..ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చూపించి ప్రత్యర్ధులని దెబ్బకొట్టడంలో జగన్ వేరు. అదే తరహాలో తమ ప్రత్యర్ధి పార్టీ అయిన టీడీపీని దెబ్బకొట్టడానికి మూడు రాజధానుల వ్యూహంతో ఎప్పటినుంచో గేమ్ నడిపిస్తూనే ఉంది. టీడీపీ ఏమో అమరావతితో ముందుకెళుతుంటే..వైసీపీ మూడు రాజధానులని తీసుకొచ్చింది.

దీని ద్వారా మూడు ప్రాంతాల్లో అభివృద్ధి అని వైసీపీ పైకి చెబుతుంది గాని..అసలు స్ట్రాటజీ వచ్చి..ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రాజకీయ లబ్ది పొందడం. రాజకీయాలు తెలిసిన ప్రతి ఒక్కరికీ ఈ మూడు రాజధానుల కాన్సెప్ట్ ఏంటి అనేది అర్ధమవుతుంది. కాకపోతే కోర్టులో ఎదురుదెబ్బలతో మూడు రాజధానుల బిల్లుని వెనక్కి తీసుకుని,మళ్ళీ కొత్త బిల్లుతో రావడానికి చూస్తుంది. ఈ లోపు రాజకీయంగా లబ్ది పొందడానికి అధికార పార్టీ అయి ఉండి కూడా మూడు రాజధానుల ఉద్యమం అని మొదలుపెట్టింది.

ఇప్పటికే విశాఖలో విశాఖ గర్జన అంటూ జే‌ఏ‌సి పేరుతో వైసీపీ ర్యాలీ నడిచింది. వైసీపీ శ్రేణుక్లు ఈ ర్యాలీని వియవంతం చేశాయి గాని..ప్రజలు ఎలా తీసుకున్నారనేది క్లారిటీ లేదు. అదే తరహాలో కర్నూలులో న్యాయ రాజధాని కోసమని పోరాటాలు మొదలుపెట్టింది. రాయలసీమ గర్జన పేరుతో డిసెంబర్ 5న సభకు ప్లాన్ చేస్తున్నారు. జే‌ఏ‌సి పేరుతో కాకుండా డైరక్ట్ వైసీపీ ఈ కార్యక్రమాన్ని చేస్తుంది.

అంటే ఇక్కడ కూడా మూడు రాజధానులకు మద్ధతు పెంచాలని చూస్తున్నారు. కానీ తాజాగా సుప్రీం కోర్టులో మాత్రం జగన్ ప్రభుత్వ తరుపున న్యాయవాది హైకోర్టు అమరావతిలోనే ఉంటుందని కోర్టుకు విన్నవించారు. దీంతో కర్నూలుకు హైకోర్టుని ఎలా తీసుకొస్తారనేది పెద్ద ప్రశ్న. పైకి కర్నూలులో హైకోర్టు అని చెప్పి..అక్కడి ప్రజలని రాజకీయం గేమ్‌తో ట్రాప్ చేయాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. మరి వైసీపీ ట్రాప్‌లో ఓటర్లు పడతారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version