గత ఐదేళ్లు ఏపీలో సాగించిన అరాచక పాలనతో వైసిపి మూల్యం చెల్లించుకుంది. ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ కనీవిని ఎరగని రీతిలో ఓటమిశగా ఉంటుంది.
వైఎస్ జగన్ నియంతృత్వ పాలనకు రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడుతూ.. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమికి ఘన విజయం దిశగా అడుగులు వేస్తుంది. కౌంటింగ్ ప్రారంభం నుంచి ఏ దశలోనూ వైసీపీ కనీస స్థాయిలో కూడా కూటమికి పోటీ ఇవ్వడం లేదు.
ఫలితాలను బట్టి చూస్తే వైసీపీకు ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ హోదా రావాలంటే 18 మంది ఎమ్మెల్యేలు అవసరం. కానీ వైసీపీ మాత్రం ఇప్పటివరకు కేవలం 14 స్థానాలు మాత్రమే ఆధిక్యంలో ఉంది. వైసీపీ కంటే మెరుగ్గా జనసేన సొంతంగానే 20 స్థానాల్లో లీడ్‌లో ఉంది.ఈ పరిస్థితుల్లో వైసీపీకు ప్రతిపక్ష హోదా ఉంటుందా? లేదా? అనే చర్చ జరుగుతోంది.