రాముడి మీద ప్రమాణం చేస్తారా.. బీజేపీ నేతలకు సామ రామ్మోహన్ సవాల్..!

-

రేషన్ కార్డులు  ఇచ్చామని రాముల వారి మీద ప్రమాణం చేస్తారా? అని బీజేపీ నేతలకు, టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి  సవాల్ విసిరారు. గాంధీభవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు.  మన రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసి పేదలకు ఇస్తున్న పథకాలపై మోడీ  పేరు పెట్టాలా..? ప్రజలే చెప్పాలన్నారు. రూపాయి సహాయం చేయని కేంద్ర ప్రభుత్వం  మనపై పెత్తనం చెలాయించాలని చూస్తోందని అన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన వాటాలను తీసుకొస్తారని, రాష్ట్రానికి ఆర్థికంగా సహాయం చేస్తారని ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను  పార్లమెంట్ పంపిస్తే.. గుజరాత్ గులాములుగా మారి తెలంగాణ ప్రజలనే బెదిరిస్తున్నారని తెలిపారు.

బొమ్మ పెట్టకపోతే సంక్షేమ పథకాలు ఇచ్చేది లేదని మాట్లాడుతున్నారని, కేంద్రప్రభుత్వం పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చిందా? అని, ఒక్క రైతుకైనా రుణమాఫీ చేసిందా అని ప్రశ్నించారు. 2014 నుంచి ఇప్పటివరకు బీజేపీ మేనిఫెస్టోలలో చెప్పిన వాటికే దిక్కు లేదని అన్నారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణకు ఐటీఐఆర్ వచ్చిందని, దానిని కూడా ఎగరేసుకొని పోయారని, బండి

Read more RELATED
Recommended to you

Latest news