న్యూఇయర్ సందర్భంగా మందుబాబులకు బంపర్ ఆఫర్!

Wine shops will be opened upto 12 midnight on 31st December

న్యూఇయర్ సెలబ్రేషన్స్ అంటే ఎక్కువగా ఏం ఉంటుందో మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కువగా మద్యానికే ప్రిఫరెన్స్ ఇస్తారు సెలబ్రేషన్స్ చేసుకునేవాళ్లు. అందుకే.. మందుబాబులకు న్యూఇయర్ గిఫ్ట్ గా డిసెంబర్ 31న ఇంకో గంట అదనంగా వైన్ షాపులు తెరుస్తారట. సాధారణంగా వైన్ షాప్స్ ఉదయం 10  నుంచి రాత్రి 11 వరకు తెరిచి ఉంటాయి. హైదరాబాద్ లో కాకుండా ఇతర ప్రాంతాల్లో అయితే ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు తెరిచి ఉంటాయి.

న్యూఇయర్ సందర్భంగా డిసెంబర్ 31 న మాత్రం జీహెచ్ఎంసీ పరిధిలో అర్ధరాత్రి 12 వరకు, ఇతర ప్రాంతాల్లో రాత్రి 11 వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఇకపోతే… బార్లు, రెస్టారెంట్లు, పబ్ లు, క్లబ్ లు, రిసార్టుల్లో వైన్స్ సెక్షన్ రాత్రి ఒంటిగంట వరకే తెరిచి ఉంటుంది.