పార్టీ నేతలకు కేసీఆర్ వార్నింగ్…

-

తెరాస ప్రభుత్వం ఏర్పడి ఇరవై రోజులు గడిచినప్పటికీ మంత్రివర్గం కూర్పు జరగలేదు..దీనిపై స్పందించిన తెరాస అధినేత కేసీఆర్ త్వరలోనే మంత్రివర్గంలో భారీ మార్పులుంటాయన్నారు. పనిచేసిన వారికే పట్టం కడతాం.. నిర్లక్ష్యాన్ని సహించేది లేదు అంటూ తన దైన శైలిలో పార్టీ నేతలకు వివరించడంతో కొంత మందికి ఆ మాటలు తగిలినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పాలనాయంత్రాంగాన్ని ప్రక్షాళన చేస్తామని, పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపునిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. దీంతో పాటు పార్టీకి నష్టం కలిగించిన వారిపై వేటుకు వెనుకాడబోమని, కొందరు ఛైర్మన్లకు ఉద్వాసన ఉంటుందన్నారు. శుక్రవారం ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చే క్రమంలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ…. ఖమ్మంలో  ఇద్దరు నేతలు ఒకరినొకరు ఓడించాలనుకుని పార్టీని ఇబ్బంది పెట్టారు. ఖమ్మం ఓటమికి స్థానిక నేతలే కారణం అన్నారు. కొన్ని జిల్లాల్లో ఛైర్మన్లు ఎన్నికల్లో సరిగా పనిచేయలేదు.

మొక్కుబడిగా పనిచేసిన వారికి ఈ సారి చెక్ పెట్టక తప్పదన్నారు. 64 ఏళ్ల వయసులో నేను కష్టపడుతున్నాను? తెలంగాణ అభివృద్ధితో పాటు దేశ ప్రగతిని కాంక్షిస్తూ పర్యటిస్తున్నానే తప్ప నాకేమీ స్వార్థం లేదు. అందరిలోనూ ఇలాంటి ఆలోచనలు రావాలి. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు నిలిపేందుకు కృషి చేయాలని పార్టీ వర్గాలకు సూచించారు. అయితే సీఎం కేసీఆర్ ఏది మాట్లాడిన దానికి ఓ లెక్క ఉంటుందనేది తెలిసిన విషయమే.. కానీ పార్టీలో ఎన్నికల సమయంలో ఇటు తెరాసలో ఉంటూ …అటు కాంగ్రెస్ తో దోస్తీ చేసిన వారికి మాత్రం ముచ్చెమటలు పట్టించేలా ఆయన చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news