చలికాలం ఇవి తింటే మీ చర్మం బాగుంటుంది…!

-

చలి కాలం అనగానే ఎన్నో రకాల వైరస్ లకు అనువైన కాలం. రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే చాలు అనేక రకాల వ్యాధులు చుట్టూ ముట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనితో చర్మం కూడా నాశనం అయిపోయే అవకాశం ఉంటుంది. అయితే ఈ కాలంలో కొన్ని రకాల వ్యాధుల నుంచి బయటపడాలి అంటే మంచి పోషక విలువలు ఉన్న ఆహారం తింటే మేలు చేస్తుందని అంటున్నారు వైద్యులు.

నిమ్మ, నారింజ, ఆపిల్‌, జామ తదితర తాజా పండ్లన్నిటిలో అధికంగా ఉండే విటమిన్‌-సి

బాదం, పిస్తా, ఆక్రోట్‌, పొద్దుతిరుగుడు గింజల్లో ఉండే విటమిన్‌- ఇ

అరటి పండ్లు, ఉడికించిన దుంపలు, సెనగల్లోని విటమిన్‌- బి6

క్యారెట్‌, బొప్పాయి, గుమ్మడి తదితరాల్లోని విటమిన్‌- ఎ

ఆకుకూరలు, పప్పు ధాన్యాల్లో ఉండే ఫోలేట్‌

సూర్యరశ్మి ప్రసాదించేవిటమిన్‌-డి

మాంసాహారం, ఆకుకూరల నుండి వచ్చే ఐరన్‌

పెరుగు, మజ్జిగలలోని ప్రోబయాటిక్స్‌

ఫాటీ యాసిడ్లు ఉన్న బాదం, ఆక్రోట్‌, పిస్తా లాంటి గింజలను రోజూ తీసుకుంటే చర్మాన్ని పొడిబారకుండా ఉంటుంది.

సూప్స్ తాగితే చర్మనానికి మంచి మేలు చేస్తుందని వైద్యులు చెప్తున్నారు. శరీరానికి నీరు చాలా అవసరం.

Read more RELATED
Recommended to you

Exit mobile version