ఆ మహిళకు రక్త కన్నీళ్లు..ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు !

Join Our Community
follow manalokam on social media

రక్త కన్నీళ్లు అనే మాట మనం చాలాసార్లు వింటూ ఉంటాం. ఎవరినైనా బాగా ఇబ్బంది పెడుతున్న సందర్భంలో ఈ మాటను మనం వాడుతూ ఉంటాం. అయితే నిజంగా కళ్ళ వెంట రక్తం కారితే ఎలా ఉంటుంది ? అమ్మో ఆ ఊహే భయంకరంగా ఉంది కదా, కానీ చండీగఢ్ కు చెందిన ఒక పాతికేళ్ల యువతికి మాత్రం కళ్ళ నుంచి రక్తం కారడం సంచలనంగా మారింది. ఈ సమస్యతో హాస్పిటల్ ను సందర్శించిన ఆమెను చూసిన డాక్టర్లకు సైతం షాక్ తగిలినట్టైంది. అయితే కళ్ల నుండి రక్తం కారుతున్న సమయంలో ఆమెకు ఎలాంటి నొప్పి గాని బాధగా కానీ అనిపించక పోవడం గమనార్హం.

అలాగే డాక్టర్లను సందర్శించడానికి ఒక నెల ముందు కూడా అలాగే కన్నీళ్లు వచ్చాయని ఆమె చెప్పుకొచ్చింది..అయితే ఆమెకి సంబంధించిన రకరకాల పరీక్షలు చేసినా అన్నీ నార్మల్గానే రావడం గమనార్హం. దీంతో డాక్టర్లకు అసలు ఏమైంది అనే విషయం అర్థం కాలేదు. తర్వాత లోతుగా పరిశీలిస్తే ఆమెకు కళ్ల నుంచి రక్త కన్నీరు వచ్చిన సమయంలో ఆమెకు రుతుస్రావం జరుగుతున్నట్లు గుర్తించారు.. ఇది ఒక అరుదైన సందర్భం అని డాక్టర్లు గుర్తించారు.. రుతుస్రావ సమయంలో ఆమె కళ్ళు, ముక్కు, పెదాలు, ఊపిరితిత్తులు, కడుపు నుంచి కూడా రక్తం బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయట. అయితే దీనికి అసలు కారణం ఏమిటి అనేది పూర్తిగా గుర్తించలేకపోయారు కానీ డాక్టర్లు మూడు నెలల పాటు పర్యవేక్షించిన అనంతరం ఆమెకు పీరియడ్స్ సమయంలో కూడా రక్త కన్నీరు రావడం ఆగిపోయిందట.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...