విమానంలో ప్రయత్నిస్తున్న సమయంలో ఓ మహిళా ప్యాసింజర్ తోటి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందుకు గురిచేసింది. దీంతో తోటి ప్యాసింజర్స్ తీవ్ర భయాందోళనకు గురయ్యారు.విమానం గాల్లో ఉండగా సదరు మహిళా ప్రయాణికురాలు సిగరేట్ ముట్టించి తాగింది.
ఇస్తాంబుల్ నుంచి సైప్రస్ వెళ్లే విమానంలో ఈ ఘటన వెలుగుచూడగా.. వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది ఆమె దగ్గర నుంచి సిగరెట్ లాక్కునే ప్రయత్నం చేశారు. సిగరెట్ ఇవ్వకపోగా, లైటర్‌తో విమానాన్నే అంటించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. సిబ్బంది బాటిల్‌తో నీళ్లు పోసి అడ్డుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సదరు మహిళ ప్రవర్తనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.