నన్ను గట్టిగా హత్తుకొని.. నా ఒళ్లంతా తడిమారు.. చీఫ్ జస్టిస్ రంజన్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు

-

గొగోయ్ నన్ను గట్టిగా పట్టుకున్నారు. నా నడుమును పట్టుకొని తన చేతులతో నా శరీరాన్నంతా తడిమారు. నన్ను బలంగా తనవైపుకు లాక్కున్నారు. నన్ను గట్టిగా హత్తుకున్నారు. గట్టిగా హత్తుకొని నన్ను అలాగే కాసేపు ఉండాలన్నారు.

ఇది నిజంగా షాకింగ్ న్యూసే. ఎందుకంటే.. భారతదేశానికి అత్యున్నత కోర్టుగా పిలవబడే సుప్రీం కోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తి మీద లైంగిక ఆరోపణలు వచ్చాయి. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్… తనను లైంగికంగా వేధించారని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. అమె ఎవరో కాదు.. గతంలో సుప్రీం కోర్టులో జూనియర్ కోర్టు అసిస్టెంట్ గా పని చేసిన మహిళ.

woman complaint on CJI ranjan gogoi

రంజన్ తనను లైంగిక వేధింపులకు గురి చేశారంటూ.. ఆమె 22 మంది జడ్జీలకు లేఖ రాసింది. ఆయన నివాసం వద్ద ఉన్న ఆఫీసులో గత సంవత్సరం అక్టోబర్ 10, 11న తనను రంజన్ వేధించారంటూ తను సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొన్నది. ఆయన లైంగికంగా వేధించేసరికి తాను వెంటనే ప్రతిఘటించానని ఆమె తెలిపింది.

గొగోయ్ నన్ను గట్టిగా పట్టుకున్నారు. నా నడుమును పట్టుకొని తన చేతులతో నా శరీరాన్నంతా తడిమారు. నన్ను బలంగా తనవైపుకు లాక్కున్నారు. నన్ను గట్టిగా హత్తుకున్నారు. గట్టిగా హత్తుకొని నన్ను అలాగే కాసేపు ఉండాలన్నారు. అయితే.. సడెన్ గా ఆయన అలా ప్రవర్తించడంతో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే ఆయన్ను గట్టిగా నెట్టేశాను. కానీ.. నన్ను ఆయన తన కౌగిలి నుంచి వెళ్లనీయకుండా గట్టిగా పట్టుకున్నారు.. అంటూ ఆమె తెలిపారు.

ఈ ఘటన జరిగిన రెండు నెలల తర్వాత అంటే డిసెంబర్ 21న నన్ను విధుల నుంచి తప్పించారు. దీంతో నా కుటుంబం రోడ్డున పడింది. ఆర్థికంగా చాలా కష్టాలను ఎదుర్కొన్నాం. అంతే కాదు.. పోలీస్ డిపార్ట్ మెంట్ లో పని చేసే నా భర్తను, ఆయన సోదరుడిని కూడా విధుల్లో నుంచి తప్పించారు. దీంతో చీఫ్ జస్టిస్ భార్యకు క్షమాపణలు కూడా చెప్పాను. నా ముక్కు నేలకు కూడా రాశా. అయినా కూడా నా కుటుంబంపై కక్ష కట్టి మమ్మల్ని ఒంటరి చేశారు.. అని ఆమె తెలిపారు.

ఈ ఆరోపణలు పూర్తిగా అసంబద్ధమైనవి, సీజేఐపై కావాలని నిందలు వేస్తున్నారు.. అంటూ సుప్రీం కోర్టు సెక్రటరీ జనరల్ తెలిపారు. న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చాలని కొందరు పని కట్టుకొని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

సీజేఐ రంజన్ గొగోయ్ కూడా తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. తనపై ఆరోపణలు చేసిన మహిళ సుప్రీం కోర్టులో రెండు నెలలు కూడా పని చేయలేదన్నారు. ఆమెకు క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉందని.. ఇలాంటి అబద్ధపు ప్రచారాల వల్ల న్యాయవ్యవస్థ స్వతంత్రతకు తీవ్రమైన ముప్పు వాటిల్లుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news