నేటి తరుణంలో సామాజిక మాధ్యమాల్లో కికి చాలెంజ్ ఏవిధంగా ట్రెండ్ అవుతుందో అందరికీ తెలిసిందే. సామాన్య పౌరులు మొదలుకొని సెలబ్రిటీల వరకు ఈ చాలెంజ్‌ను స్వీకరించి వీడియోలను షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మరోవైపు పోలీసులు ఇలాంటి చాలెంజ్‌లు స్వీకరించి అనవసరంగా ప్రాణాలు కోల్పోవద్దని హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ కికి చాలెంజ్ చేసేవారు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఓ మహిళ విమానంలో కికి చాలెంజ్ చేసింది. అనంతరం చట్టపరంగా చిక్కుల్లో ఇరుక్కుంది.
ఈవా జు బెక్ అనే ఓ మహిళ విమానాశ్రయంలో ఆగి ఉన్న ఓ విమానంలో పాకిస్థాన్ జెండాను చుట్టుకుని రేపర్ డ్రేక్ పాట అయిన ‘కికి, డు యు లవ్ మి’ కి అనుగుణంగా స్టెప్పులేసింది. అనంతరం ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయగా, కొన్ని గంటల్లోనే ఆ వీడియో కాస్తా వైరల్ అయింది. అయితే దీని పట్ల పాకిస్థాన్ ప్రభుత్వం స్పందించింది. ఆ మహిళపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.
A woman does kiki challenge stunt on the PIA aircraft and the tarmac. Wearing green and white dress and draping the Pakistan's national flag around her body, she is seen dancing on the aisles of the aircraft and then on the tarmac.@Official_PIA @pid_gov #PIA #KikiChallenge pic.twitter.com/hwvVSm9VIu
— The Nation (@The_Nation) August 13, 2018
అయితే తానొక వ్లాగర్ (వీడియో బ్లాగర్)నని, ట్రావెలింగ్ టు కరాచీ అనే వ్లాగ్ కోసం పలువురు అడిగితే ఇలా చేశానని, తనకు పాకిస్థాన్ అంటే ఎంతో గౌరవమని, తాను చేసిన ఆ వీడియో పాకిస్థాన్ టూరిజం కోసమని, అందులో ఏమైనా తప్పుంటే క్షమించాలని ఆమె కోరింది. త్వరలో పాకిస్థాన్‌లో అందమైన ప్రదేశాల కోసం మరో వీడియో చేస్తానని చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా.. ఈ కికి చాలెంజ్ ఇంకా ఇలాంటి ఉపద్రవాలను ఎన్నింటిని మోసుకువస్తుందో కదా..!