ఆటో డ్రైవర్‌ అసభ్య ప్రవర్తన.. రన్నింగ్‌ ఆటో నుంచి దూకేసిన యువతి

-

మహిళలపై అఘాయిత్యాలను అడ్డుకునేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. వారిపై దారుణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ప్రతి క్షణం దేశంలో ఎక్కడో ఒకచోట మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇండ్లు, రోడ్లు, షాపింగ్‌మాల్స్‌, సినిమాహాల్స్‌ అన్న తేడా లేకుండా.. ఎక్కడపడితే అక్కడ మహిళలు వేధింపులు ఎదుర్కొంటున్నారు.

తాజాగా మహారాష్ట్రలోని ముంబై నగరంలో ఓ ఆటోడ్రైవర్‌ యువతిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. మాటిమాటికి వెనక్కు తిరిగి కొంటెచూపులు చూశాడు. చివరికి ఆటోను యువతి చేరాల్సిన ప్రాంతంవైపు తీసుకెళ్లకుండా దారిమళ్లించాడు. దీంతో ఒక్కసారిగా భయపడిపోయిన రన్నింగ్‌ ఆటోలోంచి దూకేసింది. ఈ ఘటనలో యువతికి స్వల్ప గాయాలయ్యాయి.

ఈ ఘటనపై బాధిత యువతి ములంద్‌ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ప్రాథమిక విచారణలో భాగంగా ఘటనా ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు.. ఆటోడ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. తమ ఇంటరాగేషన్‌ తర్వాత నిందితుడిని కోర్టులో హాజరుపర్చి తగిన శిక్షపడేలా చేస్తామని ములంద్‌ పోలీస్‌స్టేషన్‌ సీఐ రవి సర్దేశాయ్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version