కారు నడుపుతూ నిద్రలోకి జారుకున్న డ్రైవర్…చివరికి

-

డ్రైవర్ నిద్రలోకి జారుకుంటే ఎంత ప్రమాదం జరుగుతుందో అందరికీ తెలిసిందే. ఇలా డ్రైవర్ లు నిద్రలోకి జారుకునే ఎన్నో ప్రమాదాలు జరగడానికి కారకులు అయ్యారు. అయితే క్యాబ్ డ్రైవర్ లు కూడా పగలు,రాత్రి అన్న తేడా లేకుండా క్యాబ్ సర్వీస్ చేస్తూ రోజుమొత్తంలో సరైన నిద్ర లేక ఇబ్బందిపడుతూ ఉంటారు. అయితే అలాంటి ఘటనే పూణే లో చోటుచేసుకుంది. క్యాబ్ లో ఇంటికి వెళదామని తేజస్వి దివ్యనాయక్ అనే మహిళ పూణే నుంచి ముంబై కి బయలుదేరింది. అయితే మార్గమధ్యలో క్యాబ్ డ్రైవర్ బండి నడుపుతూ నిద్రలోకి జారుకున్నాడు. స్టీరింగ్ వదిలేసి కునుకు తీయటంతో రెండుసార్లు కారు ప్రమాదానికి గురయ్యేది. ఇంక ఇలా వెళితే ఇంటికి కన్నా పరలోకానికి వెళతామనుకున్న ప్రయాణికురాలు డ్రైవర్ను తప్పించి తానే స్టీరింగ్ తీసుకుని క్షేమంగా గమ్యానికి చేరింది. అయితే ఆమెకు డ్రైవింగ్ తెలియంతో డ్రైవర్ ను ఒప్పించి స్టీరింగ్ అందుకుంది. దీనితో డ్రైవర్ పక్కసీట్లు కూర్చొని హాయిగా నిద్రలోకి జారుకున్నాడు. ఊబెర్ కారులో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వీడియో తీసి ట్విట్టర్, ఇన్ స్ట్రాగ్రాంలో పోస్టు చేయడం తో ఈ వీడియో వైరల్ గా మారిపోయింది.

మొదట నిద్ర లోకి జారుకుంటున్న నేపథ్యంలో అతడు నిద్రపోకుండా ఉండేందుకు అతడితో మాట్లాడటం మొదలెట్టింది. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా డ్రైవర్ నిద్రలోకి జారుకుని స్టీరింగ్ వదిలేస్తుండడం తో రెండుసార్లు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. దీనితో ఇక అతడు కారు నడిపే పరిస్ధితిలో లేడని తెలుసుకున్న తేజస్వీని కారును పక్కకు ఆపమని కోరి డ్రైవింగ్ చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరింది. దీనితో స్టీరింగ్ ను ఆమె చేతిలో పెట్టిన డ్రైవర్ పక్క సీటు లో ఆరాం గా నిద్ర పోయాడు.

Read more RELATED
Recommended to you

Latest news