మొక్క కోసం రెండేళ్ల నుంచి కష్టపడింది..అసలు సంగతి తెలిస్తే షాకే!

-

మొక్కలు అంటే కొందరికి పిచ్చి ఉంటుంది. మొక్కల పెంచుకుంటూ చాలామంది గార్డెనింగ్ చేసుకుంటూ లైఫ్ ని చాలా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే అలా మొక్కలంటే పిచ్చి ఉన్న ఒక మహిళ రెండేళ్ల నుంచి నీళ్లు పోస్తూ ప్రాణంగా పెంచుకుంటూ వచ్చింది, అయితే ఆ తరువాత అసలు విషయం తెలిసి ఒక్కసారిగా ఆ మహిళ షాక్ కు గురైంది. ఇంతకీ ఏంటి అని అనుకుంటున్నారా. వివరాల్లోకి వెళితే….కాలిఫోర్నియా కు చెందిన కేలీ విక్స్ కు మొక్కలంటే చాలా ఇష్టం. ఆ ఇష్టం టోన్ సక్కులేంట్ మొక్కను తీసుకువచ్చి ప్రాణంగా సాకింది. ఆ మొక్కను చూసుకుంటూ రెండేళ్లు దానిని వంటగది కిటికీ లో ఉంచి నిత్యం నీళ్లు పోస్తూ వచ్చింది. అయితే రెండుళ్లు అయినా కూడా ఆ మొక్కలో ఎలాంటి ఎదుగుదల కనిపించలేదు సరికదా చిన్న ఆకు అయినా కూడా రాకపోవడం తో చాలా బాధపడింది. అయితే ఒకవేళ కుండీ మారిస్తే ఏమైనా ఫలితం ఉంటుందా అని ఆలోచించిన కేలీ దాని కుండీ మార్చాలని నిర్ణయించుకుంది. దీనితో ఆ కుండీలో నుంచి మొక్కను తీసి వేరే కుండీ కి మార్చే క్రమంలో అసలు విషయం తెలిసింది.

ఎందుకంటే ఆ మొక్క ప్లాస్టిక్ దట. దీనితో విషయం తెలుసుకున్న ఆ మహిళ ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఇంతకాలం తను నీళ్లు పోసింది ఓ ప్లాస్టిక్ మొక్కకా అని బాధపడింది. ఆ బాధను తగ్గించుకోవడం కోసం తన కథను నలుగురితో పంచుకోవాలనుకుంది. దీనితో షేస్‌బుక్‌లో తన ప్లాస్టిక్ మొక్క తతంగాన్ని అందరికీ చెప్పింది. ఆమె పెట్టిన పోస్టుకు చాలామంది స్పందిస్తూ ఈ రోజుల్లో ప్లాస్టిక్ మొక్కలకు, నిజమైన మొక్కలకు పోలిక తెలియడంలేదంటూ కొందరు కామెంట్ పెడుతున్నారు. కొందరు ఆమెకు ధైర్యం చెబుతుండగా. మరికొందరేమో వెటకారంగా కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news