రూ.250కే ఎల్ఐసీ పాల‌సీ.. మ‌హిళ‌ల‌కు ప్ర‌త్యేకం..!

-

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) దేశంలోని పౌరుల‌కు ఎన్నో ర‌కాల ఇన్సూరెన్స్ పాల‌సీల‌ను అందిస్తోంది. అయితే వాటిల్లో మ‌హిళ‌ల‌కు కూడా ప్ర‌త్యేక‌మైన పాల‌సీల‌ను అందుబాటులో ఉంచారు. అలాంటి పాల‌సీల్లో ఎఐసీ ఆధార్ షీలా పాల‌సీ కూడా ఒక‌టి. ఇది కేవ‌లం మ‌హిళ‌ల కోసం మాత్ర‌మే అందుబాటులోకి తెచ్చిన పాల‌సీ. దీని ద్వారా మ‌హిళ‌ల‌కు ఇన్సూరెన్స్ తోపాటు పాల‌సీ ముగిశాక డ‌బ్బు కూడా చేతికి వ‌స్తుంది.

women can take lic policy for only rs 250

ఎల్ఐసీ ఆధార్ షీలా పాల‌సీని కేవ‌లం రూ.250 చెల్లించి తీసుకోవ‌చ్చు. దీనికి క‌నీసం రూ.75వేల వ‌ర‌కు ఇన్సూరెన్స్ క‌వ‌ర్ ల‌భిస్తుంది. గ‌రిష్టంగా రూ.3 ల‌క్ష‌ల వ‌ర‌కు ఇన్సూరెన్స్ వ‌స్తుంది. దీన్ని 10 నుంచి 20 ఏళ్ల కాల ప‌రిమితితో తీసుకోవ‌చ్చు. గ్యారంటీడ్ రిట‌ర్న్ ఎండోమెంట్ స్కీం కింద‌కు ఈ పాల‌సీ వ‌స్తుంది. అందువ‌ల్ల పాల‌సీ మెచూర్ అయ్యాక డ‌బ్బులు చేతికి వ‌స్తాయి.

ఈ పాల‌సీని ఆధార్ కార్డుతో తీసుకోవ‌చ్చు. పాల‌సీ తీసుకున్నా న‌చ్చ‌క‌పోతే అందుకు 15 రోజుల స‌మ‌యం ఉంటుంది. అప్ప‌టిలోగా క్యాన్సిల్ చేసుకోవ‌చ్చు. ఇక దీంట్లో 31 సంవ‌త్స‌రాలు ఉండే మ‌హిళ 20 ఏళ్ల‌కు గాను పాల‌సీ తీసుకుంటే ఏడాదికి రూ.10,723 ప్రీమియం చెల్లిస్తే పాల‌సీ గ‌డువు ముగిశాక వారు చెల్లించిన మొత్తం రూ.2,14,696 అవుతుంది. కానీ చేతికి రూ.3.97 ల‌క్ష‌లు వ‌స్తాయి. దీనికి తోడు పాల‌సీ గడువు ముగిసే వ‌ర‌కు రూ.3 ల‌క్ష‌ల వ‌ర‌కు ఇన్సూరెన్స్ ల‌భిస్తుంది. ఏడాదికి రూ.10,720 అంటే దాదాపుగా రోజుకు రూ.29 పొదుపు చేస్తే చాలు, ఈ పాల‌సీకి సుల‌భంగా ప్రీమియం చెల్లించ‌వ‌చ్చు. నెల‌వారీ, 3 నెల‌ల‌కు ఒక‌సారి కూడా ప్రీమియం చెల్లించ‌వ‌చ్చు. 8 నుంచి 55 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న మ‌హిళలు ఈ పాల‌సీ తీసుకోవ‌చ్చు. పాల‌సీదారు మ‌ర‌ణిస్తే వారి నామినీల‌కు ఇన్సూరెన్స్ మొత్తం చెల్లిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news