మీ ఆధార్ కార్డును డిజిట‌ల్ సిగ్నేచ‌ర్‌తో వాలిడేట్ చేయండిలా..!

-

యూనీక్ ఐడెంటిఫికేష‌న్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) అందించే ఆధార్ కార్డును డిజిట‌ల్ రూపంలోనూ వాడుకునేందుకు వీలు ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆధార్ కార్డు ఫిజిక‌ల్‌గా అందుబాటులో లేక‌పోయినా దాన్ని డిజిట‌ల్ రూపంలో వాడుకునేందుకు వీలు క‌ల్పించారు. అయితే డిజిట‌ల్ రూపంలో ఉండే ఆధార్ కార్డు పీడీఎఫ్ రూపంలో ఉంటుంది. కానీ దాన్ని ధ్రువీక‌రించేందుకు గాను డిజిట‌ల్ సిగ్నేచ‌ర్‌ను వెరిఫై చేయాల్సి ఉంటుంది. అదెలాగంటే…

ఆధార్ కార్డును ఆధార్ సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నాక పీడీఎఫ్‌ను ఓపెన్ చేయాలి. సాధార‌ణంగా పేరులోని మొద‌టి నాలుగు అక్ష‌రాలు (ఆంగ్ల అక్ష‌రాలు, క్యాపిట‌ల్ లెట‌ర్స్), పుట్టిన సంవ‌త్స‌రం క‌లిపి పాస్‌వ‌ర్డ్ ఉంటుంది. ఆ పాస్‌వ‌ర్డ్‌ను ఎంట‌ర్ చేసి ఆధార్ పీడీఎఫ్‌ను ఓపెన్ చేయాలి. అనంత‌రం అందులో చిరునామా కింద‌, క్యూ ఆర్ కోడ్ ప‌క్క‌న ఒక్క ప్ర‌శ్న మార్కు క‌నిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయాలి త‌రువాత వ‌చ్చే పాప‌ప్ బాక్స్‌లో సిగ్నేచ‌ర్ ప్రాప‌ర్టీస్ అని ఉంటుంది. దాన్ని ఎంపిక చేసుకోవాలి.

అనంత‌రం వ‌చ్చే మ‌రో పాప‌ప్‌లో పై భాగంలో షో స‌ర్టిఫికెట్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయాలి. ఆ త‌రువాత వ‌చ్చే పాప‌ప్‌లో యాడ్ టు ట్ర‌స్టెడ్ స‌ర్టిఫికెట్స్ అని క‌నిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి వెంట‌నే వ‌చ్చే ఆప్ష‌న్‌లో ఓకే ను ఎంచుకోవాలి. దీంతో ఆధార్ కార్డు డిజిట‌ల్ సిగ్నేచ‌ర్ వాలిడేట్ అవుతుంది. ఇక అంత‌కు ముందు ప్ర‌శ్న చిహ్నం ఉన్న స్థానంలో డిజిట‌ల్ సిగ్నేచ‌ర్ వెరిఫై అయిన‌ట్లు చూపిస్తూ టిక్ మార్క్ క‌నిపిస్తుంది. అంటే మీ ఆధార్ కార్డు డిజిట‌ల్‌గా వాలిడిటీ పొందిన‌ట్లు అర్థం. దాన్ని ఎక్క‌డైనా గుర్తింపు కోసం వాడ‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news