మ‌హిళ‌లూ.. వేధింపుల‌ను ఎదుర్కొంటున్నారా..? వెంట‌నే ఈ నంబ‌ర్ల‌కు కాల్ చేయండి..!

-

తెలంగాణ రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు షీ టీమ్స్ ద్వారా మెరుగైన ర‌క్ష‌ణ అందుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ఏర్పాటు చేసిన షీ టీమ్స్ విభాగం ఎప్ప‌టిక‌ప్పుడు మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పిస్తూ ఆక‌తాయిల ఆట క‌ట్టిస్తోంది.

ప్రస్తుత త‌రుణంలో దేశంలో ఎక్క‌డ చూసినా రోజు రోజ‌కీ మ‌హిళ‌ల‌పై అత్యాచాలు, లైంగిక దాడులు, వేధింపులు ఎక్కువై పోయాయి. దీంతో మ‌హిళ‌లు ఒంట‌రిగా వెళ్లాలంటేనే భ‌య ప‌డుతున్నారు. ఎక్క‌డ ఏ కామాంధుడు పొంచి ఉంటాడో.. ఏం ఇబ్బందుల‌కు గురి కావ‌ల్సి వ‌స్తుందోన‌ని మ‌హిళ‌లు ఆందోళ‌న చెందుతున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మ‌హిళ‌ల‌కు షీ టీమ్స్ ద్వారా మెరుగైన ర‌క్ష‌ణ అందుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ఏర్పాటు చేసిన షీ టీమ్స్ విభాగం ఎప్ప‌టిక‌ప్పుడు మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పిస్తూ ఆక‌తాయిల ఆట క‌ట్టిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ‌ రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో మ‌హిళ‌ల‌కు అందుబాటులో ఉన్న షీ టీమ్స్ ఫోన్ నంబ‌ర్ల వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి.

హైదరాబాద్ సీపీ – 9490616555
రాచకొండ సీపీ – 9490617111
రామగుండం – 9908343838
వరంగల్ సీపీ – 9491089257
ఖమ్మం – 9494933940
ఆదిలాబాద్ – 9963349953
మెదక్ – 9573629009
వికారాబాద్ – 9849697682
నల్గొండ – 9440066044
నిజామాబాద్ – 9490618029
కొత్తగూడెం – 9949133692
సంగారెడ్డి – 9490617005
రైల్వే పోలీస్ సికింద్రాబాద్ – 9440700040
నిర్మల్ – 94090619043
మహబూబ్‌నగర్ – 9010132135
సైబరాబాద్ – 9490617444
కామారెడ్డి – 8985333321
నాగర్ కర్నూల్ – 9498005600
సూర్యాపేట – 9494444833
సిద్ధిపేట – 7901640473
క‌రీంనగర్ – 9440795183
మహబూబాబాద్ – 9989603958
రాజన్న సిరిసిల్ల – 7901132113
జ‌గిత్యాల – 8374020949
వ‌న‌పర్తి – 6303923211
జయశంకర్ భూపాలపల్లి – 9705601290
ఆసిఫాబాద్ కుమ్రం భీం – 9440957623
డయల్ – 100
మెయిల్: [email protected]
ట్విట్టర్: women safety wing@shesafe_ts

మ‌హిళలు ఎవ‌రైనా స‌రే.. ఎక్క‌డైనా స‌రే.. వేధింపుల‌కు గుర‌వుతుంటే పైన తెలిపిన మీకు స‌మీపంలోని ఫోన్ నంబ‌ర్ల‌కు కాల్ చేసి వెంట‌నే షీటీమ్స్ స‌హాయాన్ని పొంద‌వ‌చ్చు. లేదా కింద తెలిపిన మెయిల్ ఐడీ, ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా కూడా వారు స‌హాయం ఆశించ‌వ‌చ్చు. అది కూడా కుద‌ర‌క‌పోతే మ‌హిళ‌లు త‌మకు స‌మీపంలో ఉన్న పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి ఫిర్యాదు చేయ‌వ‌చ్చు. దీంతో షీ టీమ్స్ రంగంలోకి దిగి ఆక‌తాయిల ప‌ని ప‌డ‌తాయి. క‌నుక మ‌హిళ‌లు త‌మ‌కు వేధింపులు ఎదురైతే ఎలాంటి భ‌యం లేకుండా నిర‌భ్యంత‌రంగా షీటీమ్స్‌ను ఆశ్ర‌యించ‌వచ్చు.!

ఈ సమాచారాన్ని భద్రంగా మొబైల్‌లో దాచుకోండి.. మన అక్క చెళ్లెళ్లకు, స్నేహితురాళ్లకు ఉపయోగపడుతుంది.. వారితో పంచుకోండి.. ఈ పోస్ట్‌ను షేర్ చేయండి.. 

Read more RELATED
Recommended to you

Latest news