అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ మహిళలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. మార్చి 8 వ తేదీ రోజు 60 ఏళ్ల పై బడిన మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్టు టీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. ఈ ఆఫర్ మార్చి 8 వ తేదీ రోజు మాత్రమే ఉంటుందని తెలిపింది. ఈ అవకాశాన్ని 60 ఏళ్ల పై బడిన మహిళలు వినియోగించుకోవాలని టీఎస్ ఆర్టీసీ కోరింది. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు టీఎస్ ఆర్టీసీ మరన్నీ అవకాశాలు కల్పించింది.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్ స్టేషన్ లలో మహిళల డ్వాక్రా గ్రూప్ లల్లో ఉత్పత్తి అవుతున్నసరుకులను విక్రయంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. అందు కోసం స్టాల్స్, స్పేసెస్ ను కూడా టీఎస్ ఆర్టీసీ ఉచితంగా ఇవ్వనుంది. మార్చి 31 వరకు ఈ సేవలు ఉచితంగా అందిస్తామని టీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. అంతే కాకుండా.. ఆసక్తి గల మహిళలకు హెవీ మోటర్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ కూడా ఇస్తామని టీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. 30 రోజుల పాటు మహిళలకు హెవీ మోటర్ వెహికిల్ శిక్షణ ఉంటుందని తెలిపింది. ఆసక్తి ఉన్న మహిళలు సమీప బస్ డిపోల్లో పేరును నమోదు చేసుకోవాలని సూచించింది.