మహిళా ప్రపంచ కప్ లో నేడు భారత ఉమెన్స్ జట్టు, బంగ్లాదేశ్ ఉమెన్స్ జట్టుతో తలపడుతుంది. సెమీ ఫైనల్స్ కు వెళ్లాలంటే.. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో మిథిలి సేనా చేతులేత్తిసింది. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న భారత ఉమెన్స్ జట్టు భారీగా పరుగులు చేయడంలో విఫలం అయింది. నిర్ణత 50 ఓవర్లలో కేవలం 229 పరుగులు మాత్రమే చేయగలిగింది. పైగా ఏడు వికెట్లను నష్టపోయింది. కాగ ఈ మ్యాచ్ లో ఓపెనర్లు స్మృతి మందన్న (30), షాఫెలి వర్మ (42) రాణించినా టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్.. దారుణంగా విఫలం అయింది.
ఓపెనర్ల తర్వాత బ్యాటింగ్ వచ్చిన యస్తికా భాటియా (50) ఒక్కరే అర్థ శతకం నమోదు చేసింది. తర్వాత వచ్చిన బ్యాటర్లు రాణించలేక పోయారు. చివర్లో రిచ ఘోష్ (26), పూజా వస్త్రాకర్ (30) పరుగులు చేయడంతో 200 స్కోర్ ను చేయగలిగింది. కాగ ఈ మ్యాచ్ లో టీమిండియా గెలిస్తేనే.. సెమీస్ ఆశాలు ఉంటాయి. ఓడితే టోర్నీ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. కాగ బంగ్లాదేశ్ ను 230 పరుగలు చేయకుండా భారత ఉమెన్స్ బౌలర్లు కట్టడి చేయగలరా.. అనేది చూడాలి మరి.