వండర్ ఫుల్ పెర్ఫార్మన్స్: డేంజరస్ బౌలర్ గా జాన్సన్ … 1 పరుగు 3 వికెట్లు !

-

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న 100 బంతుల లీగ్ లో నిన్న రాత్రి ఓవల్ ఇన్విన్సిబుల్స్ మరియు మాంచెస్టర్ ఒరిజినల్స్ ల మధ్యన జరిగిన మ్యాచ్ లో ఒక అరుదైన రికార్డ్ నమోదు అయింది. ప్రపంచ క్రికెట్ లో ఇలాంటి రికార్డ్ నమోదు అయి ఉండదు అని తెలుస్తోంది. ఈ టోర్నమెంట్ లో మొత్తం 100 బంతులు ఉండగా, ఒక్కో బౌలర్ 20 బంతులు మాత్రమే వేయాల్సి ఉంటుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఓవల్ జట్టు నిర్ణీత బంతులలో 186 పరుగులు చేసింది. బదులుగా పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మాంచెస్టర్ ఆస్ట్రేలియాకు చెందిన స్పెన్సర్ జాన్సన్ బౌలింగ్ కు బెదిరిపోయింది. ఎంతలా అంటే ఇతను వేసిన 20 బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు.

ఈ ప్రదర్శనతో ఒక్కసారిగా ఇతని పేరు క్రికెట్ వర్గాలలో మారుమ్రోగిపోతోంది. ఐపీఎల్ లేదా ఇతర లీగ్ లలో దక్కించుకోవడానికి అప్పుడే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ టాక్ వినిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news