జులై 31 వరకు వర్క్ ఫ్రం హోం.. కేంద్రం కీలక ప్రకటన

-

కరోనా వైరస్ తీవ్రత నేపధ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఐటి కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తాజాగా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ… ఐటి కంపెనీల వర్క్ ఫ్రం హోం ని జూలై 31 వరకు పొడిగిస్తామని, ఐటిలో 85 శాతం పనులు ఇంటి నుండే జరుగుతున్నాయని వివరించారు. ముందు ఇచ్చిన గడువు ఆధారంగా రేపటి తో వర్క్ ఫ్రం హోం ముగుస్తుంది.

ప్రసాద్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రాష్ట్ర ఐటి మంత్రులు, అధికారులతో చర్చలు జరిపారు. వర్క్ ఫ్రం హోం కోసం చాలా చాలా సడలింపులు ఇచ్చామని ఆయన వివరించారు. వర్క్ ఫ్రం హోం ప్రమాణంగా మారాలని తాము కోరుకుంటున్నాం అని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో కొత్త స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సహించాలని కోరారు. ఇక ఈ సందర్భంగా బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోడీ కీలక సూచన చేసారు.

మహమ్మారిని అరికట్టడానికి అన్ని రాష్ట్రాల ఉత్తమ వ్యూహాలను పంచుకోవడానికి గానూ ఒక యాప్‌ను అభివృద్ధి చేయాలని కోరారు. దీనిపై స్పందించిన రవి శంకర్ ప్రసాద్… నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ (ఎన్ఇజిడి) & నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసి) ను ఒక యాప్ సిద్ధం చేయమని తాను కోరినట్టు చెప్పారు. ఎన్ఇజిడి మరియు ఎన్ఐసి రెండూ మూడు రోజుల్లో ఒక యాప్ ను అభివృద్ధి చేయడానికి అంగీకరించాయని ఆయన వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news