పదో తరగతి పరిక్షలు రద్దు చేసిన కేంద్రం…!

-

లాక్ డౌన్ లో ఇప్పుడు విద్యార్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పరిక్షలు నిర్వహించే అవకాశాలు ఏ విధంగా కూడా కనపడటం లేదు. దీనితో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 1 నుంచి 9 వ తరగతి వరకు పరిక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్‌లలో ఉన్న CBSE బోర్డుకి సంబంధించిన టెన్త్, ఇంటర్ సెకండ్ ఇయర్ పరిక్షలు నిర్వహించే అవకాశం లేదని పేర్కొంది.

ఈ పరిక్షలు రాయని విద్యార్థులకు అంతకు ముందు ఏడాది కాలంలో రాసిన పరీక్షల్లో వచ్చిన మార్కులను ఆధారంగా పై తరగతులకు వెళ్ళేది లేనిదీ నిర్ణయిస్తారు. ఎగ్జామ్స్ రద్దు నిర్ణయంపై తుది నిర్ణయాన్ని రాష్ట్రాలకు ఇచ్చింది కేంద్రం. రాష్ట్రాల్లో బోర్డులు దీనిపై తుది నిర్ణయం తీసుకుంటాయి. CBSE… టెన్త్, ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్‌ని మార్చిలో వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

అప్పుడు దేశంలో కరోనా ఎక్కువగా ఉండటం తో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర HRD మంత్రి రమేష్ పోఖ్రియాల్ రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి… వచ్చే ఏడాది JEE, NEET… ఎంట్రన్స్ టెస్ట్ సిలబస్‌ను 30 శాతం తగ్గిస్తున్నామని అన్నారు. ఇప్పటికే జరిగిన పరీక్షల ఆన్సర్ షీట్లకు వాల్యుయేషన్ ప్రారంభించాలని ఆయన విజ్ఞప్తి చేసారు. షెడ్యూల్ టైమ్‌కే రిజల్ట్స్ ప్రకటించేందుకు ప్రయత్నించాలని ఆయన సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news