వర్క్ ఫ్రం హోం… కరోనా ప్రభావంతో ఇప్పుడు అన్ని సంస్థలు కూడా తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ప్రకటిస్తున్నాయి. జనాలు ఎవరూ బయటకు రావొద్దని, ఉద్యోగులు ఎవరూ కూడా ఇళ్ళ నుంచి బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. దీనితో అందరూ ఇళ్ళల్లో ఉండి వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. మరి ఈ వర్క్ ఫ్రం హోం లో చెయ్యాల్సినవి ఏంటీ…? ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి…? వర్క్ పెండింగ్ పడకూడదు అంటే ఎం చెయ్యాలి.
ఆఫీస్ కి అయితే ఉదయం లేవాలి… ఆరు గంటలకు లేచి పాలు తేవాలి, షర్టు ఐరన్ చేసుకోవాలి. ఇంట్లో ఉండి వర్క్ చేస్తే ఆ గోల లేదు. కాబట్టి ఒక రెండు గంటలు ఆలస్యంగా లేవొచ్చు. వర్క్ చేస్తూనే వాటిని చేసుకోవచ్చు. ఇది అంత మంచిది కాదు అని హెచ్చరిస్తున్నారు. వర్క్ ఫ్రం హోం అంటే ఆఫీస్ కి ఏ విధంగా వెళ్తున్నారో అలానే లేవాలి. ఇంట్లో ఉన్నా సరే మీ పని ఏదీ కూడా ఆగే పరిస్థితి ఉండకూడదు.
ఆరు గంటలకు లేస్తారా…? లేవండి. లేచి పనులు అన్నీ చేసుకుని ఆఫీస్ టైం కి రెడీ అయి కూర్చోవాలి. సిస్టం ఆన్ చేసుకుని రెడీ గా ఉండాలి. వర్క్ అసలు అసలు పెండింగ్ పెట్టుకోవద్దు. ఫాస్ట్ గా కానిచ్చేయండి. లేదు మీరు పెండింగ్ పెడితే ఆ వర్క్ వాయిదా పడటం మీకు బద్ధకం రావడం అన్నీ ఒక్కసారే జరుగుతాయి. కాబట్టి మీ కెరీర్ మీద అది ప్రభావం చూపిస్తుంది. దీనితో మీ నైపుణ్యం తగ్గిపోయే అవకాశాలు కూడా ఉంటాయి.
వర్క్ ఫ్రం హోం చేసే వాళ్లకు మైండ్ ఫ్రీ గా ఉండాలి. ఇంట్లో ఒత్తిళ్ళు అన్నీ కూడా భుజాన వేసుకుని దాని గురించి ఆలోచించి సమయం వృధా చేసుకోవద్దు. టీవీ చూడాలి అనుకుంటే వర్క్ చేసుకుని చూడండి గాని వర్క్ పోస్ట్ పోన్ చేసి టీవీ చూడవద్దు. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు. మనకు ముద్దాడాలి అనిపిస్తుంది. కాబట్టి పని చేసుకున్న తర్వాత ఆడండి గాని పని ముందు పెట్టుకుని ఆడితే మీరు ముద్దు కూడా సరిగా పెట్టుకోలేరు.
ఇంట్లో ఉన్నాం కదా అని చుట్టాలను ఆహ్వాని౦చవద్దు. ఈగలు మాదిరి చుట్టూ చేరి మీకు కబుర్లు చెప్తారు. మీ వర్క్ పెండింగ్ పడిపోతుంది. మీకు అంటూ ఒక గది ఉండాల్సిందే. అక్కడ టీవీ అసలు లేకుండా చూసుకోండి. మీ గదిలో మీరు ఉండండి గాని పని ముందు పెట్టుకుని బయటకు వచ్చి పెత్తనాలు చేయకండి. మాది ఎం ఉంది మీ పనే పెండింగ్ లో పడిపోతుంది. నిద్ర ఎక్కువ పోవద్దు.
ఇంట్లో ఉన్నాం కదా అని చాలా మంది మధ్యాహ్నం సమయంలో నిద్ర పోతారు. అలవాటు లేని వాళ్లకు అదో దరిద్రపు అలవాటు. ఇప్పుడు పడుకుంటే రేపు మళ్ళీ ఆఫీస్ కి వెళ్తే అక్కడ కూడా నిద్రపోతారు. అది అంత మంచిది కాదు. కచ్చితంగా పని మీద ప్రభావం చూపిస్తుంది. రోడ్ల పక్కన, రైల్వే ట్రాక్ పక్కన ఇల్లు ఉండే వాళ్ళు అయితే కచ్చితంగా ఇంటి తలుపులు వేసుకోండి. ఆ సౌండ్ దెబ్బకు మీకు చికాకు మినహా మరొకటి ఉండదు.
గదిలో ఉక్కపోత లేకుండా చూసుకోండి. మనకు అసలే వేడి ఎక్కువ. దీనితో ఆ ప్రభావం పని మీద పడుతుంది. డబ్బులు ఉంటే ఎందుకు అయినా మంచిది ఇన్వర్టర్ పెట్టుకోండి. ఫోన్ చేతిలో ఉంది కదా మనను ఎవరూ చూడటం లేదు కదా అని చెప్పి ఫోన్ లో గేమ్స్ ఆడితే ఆ ప్రభావం పని మీద పడుతుంది. టైం కి ఆహారం తినాల్సిందే. అసలు ఆలస్యం చేయవద్దు. కూర్చునే సీటింగ్…
ఆఫీస్ లో అన్ని సరిగా ఉంటాయి. ఇంట్లో పడుకోవడానికే గాని కూర్చోవడానికి అనువైన పరిస్థితి ఉండదు. కాబట్టి మీరు జాగ్రత్తగా కూర్చోండి. లేదా ఆ సమస్యలు తీవ్రంగా ఉంటాయి. మీరు వాడే పరికరాలు అన్నీ కూడా చాలా శుభ్రంగా ఉండే విధంగా చూసుకోండి. నీట్ గా స్నానం చేసిన తర్వాతే మీరు పనిలో కూర్చోవడం చాలా మంచిది. బద్ధకం లేకుండా ఉంటుంది. నెట్ స్పీడ్ అనేది చాలా అవసరం.
ల్యాప్టాప్ కూడా చాలా స్పీడ్ గా ఉండాలి. లేకపోతే మాత్రం అది పని మీద మీ కెరీర్ మీద ప్రభావం చూపిస్తుంది. పనిచేసే సమయంలో రెగ్యులర్ గా వాటర్ తాగండి. కూలింగ్ వాటర్ ఎక్కువ తాగకండి. బాగా అలసటగా ఉన్నా బోర్ కొడుతున్నా సరే ఒక రెండు మూడు నిమిషాలు పాటలు పెట్టుకోండి. లేదా ఒక మంచి కామెడి సీన్ చూసుకోండి. ముఖ్యంగా చెప్పేది ఏంటీ అంటే… మీరు టైపింగ్ చేసే సమయంలో మీ మోచేతుల కంటే కీబోర్డ్ పైకి ఉండకుండా జాగ్రత్త పడాలి.
లేకపోతే మాత్రం మెడ వెనుక భాగంలో నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది. వర్క్ లో గోల్ అనేది చాలా అవసరం. ఎంత పని చెయ్యాలి, ఏ పని చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేది ఒక షెడ్యుల్ పెట్టుకుని పని చేయండి. డ్రై ఫ్రూట్స్ వర్క్ ఫ్రం లో ఆకలి తీర్చడానికి బాగా ఉపయోగపడతాయి. బాదం, జీడిపప్పు, వేరు శనగ, పిస్తా, మంచి ఎనర్జీ ఇస్తాయి. వేపిన బఠానీలు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. యౌట్యూబ్ లో సినిమాలు చూడటం మానేయండి.
ఒక్కసారి వినోదానికి అలవాటు పడ్డారో ఇక మీరు చేసే పని బొంబాయి అవుతుంది. కాబట్టి ఆఫీస్ లో ఉంటే ఎలా చేస్తారో అలానే చేసుకోండి. ఇంట్లో ఉంటే ఏకాగ్రత చాలా తక్కువగా ఉంటుంది. మనసులో ఒక భయం పెట్టుకుంటే ఏకాగ్రత గా పని చేసుకోవచ్చు. వర్క్ ఫ్రం కి అలవాటు పడండి. మా మనలోకంలో ఫ్రీ లాన్స్ చేసే వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తూ చేస్తారు. అలవాటు పడితే దాన్ని మించిన సుఖం ఉండదు. అమ్మ వంట, అమ్మమ్మ వంట, ఇంట్లో సందడి… ఆ గోలే వేరు.