వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పాయే..వర్క్‌ ఫ్రమ్‌ పబ్‌ వచ్చే..! కొత్త కల్చర్‌తో ఉద్యోగుల్లో పెరిగిన జోష్‌!!

-

కరోనా వల్ల వర్క్‌ ఫ్రమ్‌ ఆఫీస్‌ పోయి..వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వచ్చింది. రెండు మూడేళ్లగా చాలామంది ఇళ్ల వద్ద ఉండే పనులు చేసుకుంటున్నారు. ఇప్పుడు వర్క్ ఫ్రమ్‌ హోమ్‌ పోయి.. వర్క్‌ ఫ్రమ్‌ పబ్‌ ట్రెండ్‌ నడుస్తోంది. ఇదేంటి..పబ్‌లో వర్కా..అయినట్లే అనుకుంటున్నారా..? ఇది జోక్‌ కాదండీ నిజమే..!యూకేలో Work From Pub (WFP) వర్క్ కల్చర్‌ని తీసుకొచ్చేశారు. అలా స్టార్ట్ చేశారో లేదో..వెంటనే ఇది వైరల్ అయిపోయిందీ. ఎంతగా అంటే…అందరూ పబ్‌లో కూర్చుని పని చేసేందుకే ఇష్టపడుతున్నారు.

కారణం అదేనా..?

బ్రిటన్‌లో పలు కంపెనీలు Work From Pub చేసుకోవచ్చని ఉద్యోగులకు చెప్పాయి. ఇంకేముంది..వాళ్లంతా ఇళ్లను వదిలి నచ్చిన పబ్‌లో, బార్‌లో కూర్చుని పని చేసేస్తున్నారు. ప్రస్తుతానికి బ్రిటన్‌లో పరిస్థితులు అంత బాలేవు.. ఆర్థిక వ్యవస్థ అంతా అతలాకుతలమైంది. ఈ వింటర్ వచ్చే నాటికి పరిస్థితులు మరింత దిగజారుతాయని నిపుణుల అంచనా. అందుకే..కొన్ని సంస్థలు ప్రత్యేకంగా ఆఫీస్‌లు పెట్టుకుని భారీగా ఖర్చు పెట్టే బదులు..ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ పబ్ ఇచ్చేస్తే బెటర్ అని నిర్ణయించుకున్నాయి. అటు పని జరిగిపోతోంది. ఇటు నిర్వహణ ఖర్చు కూడా తగ్గిపోతోంది.
డిస్కౌంట్‌లు కూడా..!
కొన్ని పబ్‌లు ఈ ఎంప్లాయిస్‌ కోసం స్పెషల్ డిస్కౌంట్‌లు కూడా ఇస్తున్నాయి. ఒక్క రోజుకి 11 డాలర్లు చెల్లిస్తే…లంచ్‌తో పాటు నచ్చిన డ్రింక్ కూడా తాగొచ్చు. ఇంకొన్ని 17 డాలర్ల వరకూ వసూలు చేస్తున్నాయి. ఇక టీ, కాఫీ అలవాటు ఉన్న వారికైతే అన్‌లిమిటెడ్‌గా అందించేస్తున్నాయి పబ్‌లు. క్లైంట్స్‌ కోసం ఎదురు చూస్తూ…ఇలా డిస్కౌంట్‌లతో గాలం వేస్తున్నాయి. ప్రమోషన్‌తో పాటు బిజినెస్‌ కూడా ఫుల్‌గా రన్ అవుతోందట…
ప్రస్తుత పరిస్థితుల్లో బ్రిటన్ వాసులు చాలా తక్కువగా ఖర్చు చేసేందుకే మొగ్గుచూపుతున్నారు.. అందుకే…వాళ్ల ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగానే ప్యాకేజ్‌లు అందిస్తున్నాయి పబ్‌లు. ఏదేమైనా…ఇప్పుడీ ట్రెండ్‌ అక్కడ బాగానే నడుస్తోంది.. ఇది పాపులర్‌ అయితే..కొన్ని కంపెనీలు ఇదే కల్చర్‌ను కంటిన్యూ చేస్తాయి. వర్క్‌ జరగడం కావాలి.. అది ఎక్కడ చేస్తే ఏంటి.. అనుకునే కంపెనీలకు ఈ ఐడియా బానే ఉంటుంది..

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version