వరల్డ్ కప్ షెడ్యూల్ లో భాగంగా ఈ రోజు చెన్నైలో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ప్రత్యర్థి ఆఫ్గనిస్తాన్ ముందు కఠినమైన లక్ష్యాన్ని ఉంచింది. ముందుగా బౌలర్లకు స్వర్గధామం అయిన పిచ్ పై పరుగులు రాబట్టడానికి కివీస్ చాలా కష్టపడింది. ఒక దశలో న్యూజిలాండ్ 110 పరుగులకు నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత ఫిలిప్స్ (71) మరియు కెప్టెన్ లాతమ్ (68) లు చాలా జాగ్రత్తగా ఆడి జట్టుకు సురక్షితమైన స్కోర్ ను అందించారు. వీరిద్దరూ అయిదవ వికెట్ కు 144 పరుగులు జోడించారు. ఇక చివర్లో చాప్ మాన్ 12 బంతుల్లో 25 పరుగులు చేయడంతో కివీస్ 6 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేయగలిగింది.
ఓపెనర్ గా వచ్చిన యంగ్ సైతం అర్ద సెంచరీ చేసి జట్టు స్కోర్ లో కీలకంగా మారాడు. మరి ఈ స్కోర్ ను బౌలర్లకు సహకరించే చెన్నై పిచ్ మీద ఆఫ్గనిస్తాన్ ఛేదిస్తుందా లేదా అన్నది తెలియాలంటే మ్యాచ్ ముగిసే వరకు వెయిట్ చేయాల్సిందే.