కాసేపటి క్రితమే సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ ముగిసింది, నిర్ణీత ఓవర్ లలో 7 వికెట్ల నష్టానికి 311 పరుగులకే పరిమితం అయింది. సౌత్ ఆఫ్రికా ఇంత తక్కువ స్కోర్ కె పరిమితం కావడానికి చివరి 10 ఓవర్లలో వారి ఆటతీరు కారణం అని చెప్పాలి. ఆఖరి 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 79 పరుగులు మాత్రమే చేయగలిగింది. డి కాక్ సెంచరీ తో తన బాధ్యతను నెరవేర్చుకోగా, ఆ తర్వాత వచ్చిన వారిలో మార్ క్రామ్ ఒక్కడే అర్ద సెంచరీ చేసి కాస్త పర్వాలేదనిపించాడు. బావుమా (35), డస్సెన్ (26), క్లాసేన్ (29), మిల్లర్ (17) లు దారుణంగా విఫలం అయ్యారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న హార్డ్ హిట్టర్ మిల్లర్ దారుణంగా ఫెయిల్ అయ్యాడు, కనీసం బంతిని టచ్ చేయలేకపోయాడు.. ఆఖరికి స్టార్క్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ స్కోర్ ఆస్ట్రేలియా ఆటగాళ్లకు సరిపోతుందా ? సౌత్ ఆఫ్రికాకు ఉన్న బౌలింగ్ లైన్ అప్ వీరిని అడ్డుకుంటుందా అన్నది తెలియాల్సి ఉంది.
ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో మాక్స్ వెల్ , స్టార్క్ లు చెరో రెండు వికెట్లు తీసుకోగా, హాజిల్ వుడ్, కమిన్స్ , జంపా లు తలో ఒక వికెట్ తీసుకున్నారు. కానీ చివరి 10 ఓవర్లలో మంచి బౌలింగ్ తో ఆకట్టుకున్నారు ఆస్ట్రేలియా.