WORLD CUP 2023: డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్… టైటిల్ ను నిలబెట్టుకుంటుందా ?

-

2019 లో జరిగిన వన్ డే వరల్డ్ కప్ ను అన్ని విభాగాల్లో అత్యుత్తముగా ప్రదర్శన చేసి టైటిల్ ను గెలుచుకుంది మోర్గాన్ సారథ్యంలోని ఇంగ్లాండ్ జట్టు. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై ఇంగ్లాండ్ ఎన్నో నాటకీయ పరిణామాల మధ్యన సూపర్ ఓవర్ ద్వారా వచ్చిన ఫలితంతో మ్యాచ్ ను గెలుచుకుంది. ఇక అక్టోబర్ 5న జరగనున్న వరల్డ్ కప్ మొదటి మ్యాచ్ లో ఈ రెండు జట్లు గుజరాత్ లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం లో మొదటి మ్యాచ్ ను ఆడనున్నాయి. ఇక ఇప్పటి వరకు మాజీ క్రికెటర్లు చెప్పిన ప్రకారం సెమిస్ కు చేరుకునే నాలుగు జట్లలో ఏ రెండు జట్లు ఉంటాయి అని తమ అభిప్రాయాన్ని చెప్పడం విశేషం. అందులో భాగంగా ఇంగ్లాండ్ ప్రస్తుతం డిపెండింగ్ ఛాంపియన్ గా టోర్నమెంట్ ను ఘనంగా ప్రారంభిస్తుండగా, జాస్ బట్లర్ సారథ్యంలో టైటిల్ ను నిలబెట్టుకుంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

ఇక ఇండియాలో ఈ వరల్డ్ కప్ జరుగుతుండడంతో ఈ పరిస్థితులకు ఏ జట్లు ఎలా తట్టుకుని నిలబడతాయి అన్నది చాలా సవాలు తో కూడుకున్న విషయం.

Read more RELATED
Recommended to you

Latest news