టీడీపీ చీఫ్ చంద్రబాబును స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ఏపీ సీఐడీ అధికారులు అరెస్టై చేసిన విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. అయితే.. చంద్రబాబు అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ టీడీపీ నేతలు నిరసన గళం వినిపిస్తున్నారు. ఈ క్రమంలోనే.. తాజాగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షనేత చంద్రబాబు అరెస్ట్ ద్వారా ఆయనపై తనకున్న ఈర్ష్య, ద్వేషం, అసూయ, పగ, ప్రతీకారాలు చూపించుకున్నాడని విమర్శించారు. సీఐడీ చీఫ్ ను బెదిరించి చంద్రబాబునాయుడిని గత 25 రోజులుగా రాజమహేంద్రవరం జైల్లో ఉంచడం చాలా దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత తప్పు చేశాడు అనడానికి ఈ ప్రభుత్వం వద్ద, సీఐడీ వద్ద ఎలాంటి ఆధారాలు, సాక్ష్యాలు లేవని వర్ల రామయ్య స్పష్టం చేశారు.
అయినా కూడా ఆయన తప్పు చేశాడని ప్రజల్ని నమ్మించడానికి జగన్ రెడ్డి అనుచరులు, ముఖ్యంగా ఆయన పార్టీకి చెందిన సజ్జల భార్గవ రెడ్డి, ఆయన నేతృత్వంలో పనిచేసే వైసీపీ సోషల్ మీడియా, ఐప్యాక్ సహకారంతో తప్పుడు సాక్ష్యాలు సృష్టికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
“వైసీపీ సోషల్ మీడియాలో యువతీ యువకుడి మధ్య జరిగే ఫోన్ సంభాషణలకు సంబంధించిన ఆడియో ఒకటి ప్రచారంలోకి వచ్చింది. దానిలో సదరు యువతి, యువకుడు మాట్లాడుకుంటున్నట్టు చిత్రీకరించిన వైసీపీ సోషల్ మీడియా, చంద్రబాబు తప్పు చేశాడు అనేలా వారి సంభాషణల్ని తయారు చేసింది.
యువతకు చంద్రబాబు అన్యాయం చేశారన్నట్టు… వైసీపీ సోషల్ మీడియానే అభూత కల్పనలతో ఒక ఆడియోను సృష్టించి సోషల్ మీడియాలో దాన్ని నిస్సిగ్గుగా వైరల్ చేస్తున్నారు. నిరుద్యోగుల్లాగా ఇద్దర్ని నియమించి, వారు మాట్లాడుకున్నట్టుగా సంభాషణల్ని రికార్డ్ చేసి, చంద్రబాబు రూ.371 కోట్లు కొట్టేసినట్టు, యువతలో ఒక అభద్రతాభావం సృష్టించడం ఎంత దుర్మార్గం?