లక్నో లో జరుగుతున్న ఆస్ట్రేలియా మరియు సౌత్ ఆఫ్రికా వన్ డే మ్యాచ్ లో విజయం ఎవరికీ దక్కుతుంది అన్నది ఇప్పడు ఉత్కంఠగా మారింది. మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా గట్టి టార్గెట్ ను ఆస్ట్రేలియా ముందు ఉంచగలిగింది. కానీ బ్యాటింగ్ లో సాలిడ్ గా ఆడగల ప్లేయర్స్ ఉన్న ఆస్ట్రేలియా ముందు ఈ స్కోర్ సరిపోతుందా అన్న ప్రశ్న ఇప్పుడు అందరి మదిలోనూ ఉంది. కానీ క్రీడా పండితులు చెబుతున్న ప్రకారం ఈ పిచ్ మీద 300 కు పైగా స్కోర్ ను ఛేదించడం అంత సులభం కాదు అంటున్నారు. ఈ పిచ్ బౌలర్లకు సెకండ్ ఇన్నింగ్స్ లో బాగా సహకరిస్తుంది అన్న భావన ఉన్న నేపథ్యంలో ఆస్ట్రేలియా కు ఛేజింగ్ చాలా కష్టంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అందులోనూ రబడా, ఎంగిడి, యాన్సెన్ రూపంలో క్వాలిటీ స్పీడ్ బౌలింగ్ మరియు శంసి, మహారాజ్ రూపంలో స్పిన్ బౌలర్లు ఉండడంతో సెకండ్ ఇన్నింగ్స్ చాలా ఆసక్తికరంగా ఉంటుందని తెలుస్తోంది. మరి ఏమి జరగనుంది ? ఛేజింగ్ లో ఆస్ట్రేలియా గెలుస్తుందా లేదా అన్నది తేలియాలనంటే మ్యాచ్ స్టార్ట్ అయ్యే వరకు ఆగాల్సిందే.