శ్రీవారి భక్తులకు శుభవార్త.. టికెట్ల విడుదల తేదీ ప్రకటన..!

-

కళియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతినెల అర్జిత సేవా టికెట్ల కోటాను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా జనవరి 2024కి సంబందించిన శ్రీవారి అర్జిత సేవ, దర్శన టికెట్లను అక్టోబర్ 18న విడుదల  చేయనున్నట్టు ప్రకటించింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మరాధన, అర్జిత సేవల ఆన్ లైన్ అక్కీడీప్ కోసం అక్టోబర్ 18న ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్ లో టికెట్లు పొందిన భక్తులు అక్టోబర్ 22 మధ్యాహ్నం 12 గంటలలోపు రుసుము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.

కళ్యాణోత్సవం అర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవా టికెట్లను అక్టోబర్ 21న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. వర్చువల్ సేవా టికెట్లను అక్టోబర్ 21 మధ్యాహ్నం 3 గంటలకు, అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను అక్టోబర్ 23 ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. అంతేకాదు.. శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం, గదుల కోటాను అక్టోబర్ 23 ఉదయం 11 గంటలకు, వృద్ధులు, దివ్యాంగులకు దర్శన టికెట్ల కోటాను అక్టోబర్ 23 మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 కోటాను అక్టోబర్ 24 ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. తిరుమల, తిరుపతిలో వసతి గదుల బుకింగ్ టికెట్లను అక్టోబర్ 25 ఉదయం 10 గంటలకు విడదల చేస్తారు. డిసెంబర్ నెలకు సంబంధించి అక్టోబర్ 27న ఉదయం 10 గంటలకు శ్రీవారి సేవ కోటా, 12 గంటలకు నవనీత సేవ కోటా, మధ్యాహ్నం 3 గంటలకు పరకామణి సేవ కోటా టికెట్లను విడుదల చేస్తారు. 

Read more RELATED
Recommended to you

Latest news