ఈ రోజు శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయి ఘోరమైన ఓటమిని చవిచూసింది. ఈ ఓటమితో దాదాపుగా ఇంగ్లాండ్ వరల్డ్ కప్ సెమీస్ కు చేరే ఆశలు లేనట్లే. కానీ ఎక్కడో ఒక దగ్గర చిన్న ఆశ ఉంది.. క్రికెట్ లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేని పరిస్థితి. పాయింట్ల పట్టిక ప్రకారం ప్రస్తుతం ఇంగ్లాండ్ తొమ్మిదవ స్థానంలో కేవలం రెండే పాయింట్లు సాధించి నెట్ రన్ రేట్ కూడా దారుణంగా ఉంది. అయితే ఇక మిగిలిన నాలుగు మ్యాచ్ లలో తప్పక భారీ తేడాతో గెలవడంతో పాటుగా మిగిలిన జట్ల గెలుపు ఓటముల పైన ఆదారపడాల్సి ఉంది. అలా జరిగినా ఇంగ్లాండ్ పూర్తి మ్యాచ్ లు అయ్యే లోపు అయిదు మ్యాచ్ లు గెలిచి 10 పాయింట్ లు గెలుస్తుంది.. అప్పుడు సెమీస్ కు చేరుతాయని భావిస్తున్న ఇండియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మరియు సౌత్ ఆఫ్రికా లలో ఎవరైనా పాయింట్ల దగ్గర ఆగిపోవడమే కాకుండా నెట్ రన్ రేట్ ఇంగ్లాండ్ కన్నా తక్కువ ఉండాలి.
ఇంగ్లాండ్ తన తర్వాత మ్యాచ్ లలో ఇండియా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్ మరియు పాకిస్తాన్ లతో ఆడుతుంది. మరి చూద్దాం వీరి అదృష్టం ఎలా ఉందొ ?