వరల్డ్ కప్ లో రసవత్తర మ్యాచ్ లకు సమయం దగ్గర పడుతోంది. నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ జరగనుండగా సెమిఫైనల్ కు అర్హత సాధించే జట్లకు ఇంకా సమయం ఉంది. కానీ ఇండియా మాత్రం వరుసగా 7 మ్యాచ్ లు నెగ్గి సెమీఫైనల్ కు చేరిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. కాగా ఈ రోజు ఆఫ్గనిస్తాన్ మరియు నెదర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ నెగ్గిన డచ్ టీం బ్యాటింగ్ ఎంచుకుని అందుకు తగిన ప్రదర్శన చేయడంలో ఘోరంగా విఫలం అయింది. ఆఫ్ఘన్ బౌలింగ్ మరోసారి రెచ్చిపోయి డచ్ ను చీల్చి చెండాడింది, నెదర్లాండ్ కు ఎక్కడ కూడా కుదురుకునే అవకాశం ఇవ్వకుండా వికెట్లు తీస్తూ మ్యాచ్ పై పట్టు బిగించింది. నెదర్లాండ్ మరో నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే 179 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. డచ్ జట్టులో సైబ్రాండ్ (58), మాక్స్ ఓడోడ్ (42) లు మాత్రమే రాణించారు..
మిగిలిన వారంతా దారుణంగా ఫెయిల్ అయ్యారు.. ఆఫ్ఘన్ బౌలర్లలో నబి మూడు మరియు నూర్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఆ తర్వాత రన్ అవుట్ ల రూపంలో నాలుగు అవుట్ అవ్వడం విశేషం. కాగా నెదర్లాండ్ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యాన్ని తక్కువ ఓవర్లలో చేజ్ చేసి సెమీఫైనల్ కు చేరువ అయ్యేలా ప్లాన్ చేసుకోవాలి.