వరల్డ్ కప్ 2023: అదరగొట్టిన నెదర్లాండ్ కెప్టెన్ ఎడ్వర్డ్స్ … సౌత్ ఆఫ్రికా షాక్ !

-

సౌత్ ఆఫ్రికా మరియు నెదర్లాండ్ జట్ల మధ్యన కాసేపటి క్రితమే మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. వర్షం కారణంగా
43 ఓవర్లకు కుదించిన మ్యాచ్ లో నెదర్లాండ్ జట్టు అద్భుతమైన పోరాటపటిమను ప్రదర్శించి 8 వికెట్లను కోల్పోయి 245 పరుగులు చేసింది. ఒక దశలో కనీసం 150 పరుగులు అయినా చేస్తుందా అనిపించింది. కానీ కెప్టెన్ ఎడ్వర్డ్స్ ఒక వైపు వికెట్లు పడుతున్నా సౌత్ ఆఫ్రికా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ ను అందించారు. ఎడ్వర్డ్స్ 69 బంతుల్లో 10 ఫోర్లు ఒక సిక్స్ తో 78 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఎడ్వర్డ్స్ కు చక్కని సహకారం అందించిన వారిలో తేజ (20), వాండెర్ మెర్వ్ (29) మరియు ఆర్యన్ దత్ (23) లు ఉన్నారు. ఎడ్వర్డ్స్ వాండర్ మెర్వ్ తో 64 పరుగులు మరియు దత్ తో కలిసి 41 పరుగులు జోడించి కీలక సమయంలో పరుగులు చేశారు.

సౌత్ ఆఫ్రికా నిజంగా ఈ ప్రదర్శన పట్ల షాక్ అయి ఉంటుంది. ఎందుకంటే… 100 లోపే వికెట్లు పడడంతో ఇంకెంతలే అనుకున్నారు. కానీ ఒక ఛాలెంజింగ్ టార్గెట్ ను పెట్టారు అంటే నిజంగా గ్రేట్.

Read more RELATED
Recommended to you

Latest news