సిద్దిపేటలో ప్రసంగిస్తూ భావోద్వేగానికి గురైన సీఎం కేసీఆర్

-

ఎన్నికల కార్యక్షేత్రంలోకి దిగిన బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ మూడోసారి గెలుపే లక్ష్యంగా రాష్ట్రంలో పర్యటనలు కొనసాగిస్తున్నారు. తొలిరోజు హుస్నాబాద్​, రెండో రోజు జనగామ, భువనగిరి సభలకు హాజరైన కేసీఆర్‌.. పార్టీ చేపట్టిన అభివృద్ధిని వివరిస్తూనే కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. మూడో రోజైన నేడు సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిద్దిపేట సభలో ఆ ప్రాంతంతో ఉన్న అనుబంధాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. చింత‌మ‌డ‌క‌లో నేను చాలా చిన్న‌గా ఉండే టైమ్‌లో, నేను ప‌సికూన‌గా ఉండే టైమ్‌లో, అమ్మ చ‌నుబాలు తాగే స‌మ‌యంలో మా అమ్మ‌కు ఆరోగ్యం దెబ్బ‌తింటే ఆ ఊర్లో ఓ ముదిరాజ్ త‌ల్లి నాకు చ‌నుబాలు ఇచ్చి సాదింది. అంత అనుబంధం ఈ గ‌డ్డ‌తో త‌న‌కుంద‌ని తెలియ‌జేస్తున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు.

Telangana CM KCR slams Budget 2022, calls it 'golmaal' - India Today

ఇక ఇక్క‌డ‌ నేను పాద‌యాత్ర చేయ‌ని గ్రామం లేదు.. నేను తిర‌గ‌ని రోడ్డే లేదు.. నేను చూడ‌ని కుంట‌లు, చెరువులు లేనే లేవు అని కేసీఆర్ తెలిపారు. ఏ ఊరికి పోయినా కూడా ఆ రోజున్న సర్పంచ్‌లంద‌రూ.. అన్న నా మీద కోపం ఉంటే సిద్దిపేట‌లో తిట్టు కానీ, మా ఊర్ల మందిలా తిట్ట‌కు అని అనేది. అంత బాగా క‌ష్ట‌ప‌డి ప‌నులు చేసి ఒక దరికి తెచ్చాం. కానీ ఆనాడు మంచినీళ్లు లేని సిద్దిపేట‌. సాగునీళ్లు లేని సిద్దిపేట‌. బంగారం లాంటి భూములు ఉన్నా పంట‌లు పండించుకోలేని సిద్దిపేట‌. కానీ మీ అంద‌రి ద‌య‌, ఆశీర్వ‌చ‌నంతో ముంద‌కు సాగాను. ఎందుకంటే అధికార పార్టీని వ‌దిలిపెట్టి, మీ అంద‌రి ద‌గ్గ‌ర ఆజ్ఞ‌ను తీసుకొని మొండి ప‌ట్టుల‌ద‌ల‌తో, మొండి ధైర్యంతో, ప్రాణాల‌కు తెగించి, ఉద్య‌మాన్ని ప్రారంభించాను. ఉద్య‌మం ప్రారంభ‌మైన‌ త‌ర్వాత ఉప ఎన్నిక వ‌చ్చింది. నాకు బ‌స్సు గుర్తు కేటాయించారు. బ‌స్సు గుర్తు తీసుకొని వ‌స్తే.. స‌మైక్య‌వాదులంతా సిద్దిపేటలో అడ్డాపెట్టి, కోట్ల‌కు కోట్లు ఖ‌ర్చు పెట్టినా, తిప్పికొట్టి 60 వేల ఓట్లతో భారీ మెజార్టీ ఇచ్చారు. తెలంగాణ ఉద్య‌మం విజ‌యం సాధించ‌డానికి పునాది వేసింది సిద్దిపేట గ‌డ్డ‌నే అని కేసీఆర్ పేర్కొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news