మాములుగా మన చుట్టూ ఉన్న వారు ఎవరైనా కొంచెం సేపు కనుక ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటే ? ఏమైంది అలా ఉన్నావు ? అంటూ కారణాలు చెప్పమని ఆరాతీస్తూ ఉంటాము. కానీ మౌనమే మంచిదంటూ , ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందంటూ కొందరు నిపుణులు చెబుతున్నారట. ఇంతకీ మౌనంగా ఉంటే ఏ విధంగా మనకు మంచిది అన్నది ఒకసారి చూసేద్దాం. ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం ప్రతి రోజూ ఒక గంట సేపు మౌనంగా ఉంటే… మనలోని ఒత్తిడి తగ్గిపోవడమే కాకుండా సృజనాత్మకత పెరుగుతుందట. కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడం, మానసికంగా దృడంగా తయారవడం, బీపీ తగ్గడం, మంచి నిద్ర పట్టడం మరియు రోగ నిరోధక శక్తి పెంపుదల ఉంటుందని తెలుస్తోంది. పైన మనము చెప్పుకున్నవన్నీ జరిగితే ఇక మనిషికి అంతకు మించి కావాల్సింది ఏమీ లేదు.
ఇక మీరు కూడా రేపటి నుండి ప్రతి రోజూ ఒక గంట సేపు మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. ఫలితం ఏ విధంగా ఉంటుందో మీ స్నేహితులతో పంచుకోండి.