వన్ డే వరల్డ్ కప్ 2023 ఈసారి ఇండియాలో జరగనుంది, ఇప్పటికే బీసీసీఐ ఇందుకోసం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకుంది. ఐసీసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 5వ తేదీ నుండి నవంబర్ 19వ తేదీ వరకు జరగనుంది. కాగా ప్రపంచంలోని కోట్లాది మంది క్రికెట్ ను ఎంతగానో ప్రేమించే ఫ్యాన్స్ ఈ వరల్డ్ కప్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ వరల్డ్ కప్ లో టైటిల్ కోసం మొత్తం పది జట్లు రెండు గ్రూప్ లుగా విడిపోయి పోటీ పడుతున్నాయి. అందులో ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా మరియు నెదర్లాండ్ లు పోటీలో ఉన్నాయి. కాగా ఈ పది జట్లలో ఏ జట్టు టైటిల్ ను చేజిక్కించుకుంటుంది అన్నది తెలియాలంటే మ్యాచ్ లు స్టార్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.
ఇక ఈ వరల్డ్ కప్ ను దక్కించుకుంటాయి అని క్రికెట్ ప్రముఖులు అనుకుంటున్న జట్లలో ఇండియా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ లు ఉన్నాయి. మరి ఏమి జరగనుంది ? ఈ వరల్డ్ కప్ లో చిన్న జట్లు పెద్ద జట్లకు షాక్ లు ఇవ్వనున్నాయా అన్నది చూడాలి.