నేటి నుంచి దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు

-

ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా స్విట్జర్లాండ్లోని దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక( 54వ డబ్ల్యూఈఎఫ్‌) వార్షిక సమావేశం జరగనుంది. ఇవాళ్టి నుంచి ఈ సదస్సు ప్రారంభం కానుంది. ఇందులో భారత్‌ సహా వివిధ దేశాలకు చెందిన 2,800 మంది నేతలు పాల్గొంటున్నారు. వీరిలో 60 మందికిపైగా ప్రభుత్వాధినేతలూ ఉన్నారు. భారత్‌ నుంచి కేంద్ర మంత్రులు స్మృతీ ఇరానీ, అశ్వినీ వైష్ణవ్‌, హర్‌దీప్‌ సింగ్‌ పురీ ఇప్పటికే దావోస్ చేరుకున్నారు.

మరోవైపు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర సీఎంలు రేవంత్‌ రెడ్డి, సిద్ధరామయ్య, ఏక్‌నాథ్‌ శిందేలు, రాష్ట్రాల మంత్రులు పలువురు, వంద మందికిపైగా సీఈవోలు ఈ సదస్సులో పాల్గొనేందుకు దావోస్ చేరారు. అయిదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వాతావరణ మార్పులు, ఘర్షణలు, నకిలీ వార్తలు సహా పలు అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. మరోవైపు ఈ సదస్సులో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌, చైనా ప్రధాని లీ కియాంగ్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌, జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సలివన్‌ పాలుపంచుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news