WORLD RECORD: ఆస్ట్రేలియాపై వెస్ట్ ఇండీస్ మహిళలు సంచలన విజయం… !

-

ఆస్ట్రేలియాలోని సిడ్నీ గ్రౌండ్ లో వెస్ట్ ఇండీస్ మహిళలు మరియు ఆస్ట్రేలియా మహిళల మధ్యన జరుగుతున్న రెండవ టీ 20 మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్ట్ ఇండీస్ మహిళలు ఆస్ట్రేలియాను నిర్ణీత ఓవర్ లలో 212 పరుగులు చేయనిచ్చారు. ఆస్ట్రేలియా మహిళలు బ్యాటింగ్ లో వెస్ట్ బౌలింగ్ ను ఒక ఆటాడుకున్నారు. ముఖ్యంగా పెర్రీ 70, లీచ్ ఫీల్డ్ 52 మరియు వేర్ హామ్ లు 32 పరుగులు చేసి ఆస్ట్రేలియా కు రికార్డ్ టార్గెట్ ను వెస్ట్ ముందు ఉంచగలిగారు. ఇక విండీస్ బౌలర్లలో కెప్టెన్ హీలీ మత్యుస్ మూడు వికెట్లు తీసింది. అనంతరం 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మరొక్క బంతి మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. వెస్ట్ ఇండీస్ ప్లేయర్స్ లో మత్యుస్ (132 పరుగులు, బంతుల్లో 64) భారీ సెంచరీ చేసి ఆస్ట్రేలియా ను చిత్తుగా ఓడించడంలో కీలక పాత్ర పోషించింది.

ఇక ఈమె ఇన్నింగ్స్ లో 20 ఫోర్లు మరియు 5 సిక్సులు సాధించింది. ఇక ఈమెకు టేలర్ (59) చాలా చక్కగా సహాయపడింది… ఈ విజయంతో వెస్ట్ ఇండీస్ టీ 20 మహిళల అంతర్జాతీయ క్రికెట్ లోనే అత్యధిక స్కోర్ ను చేధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్ ల సిరీస్ 1 – 1 తో సమంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version