చంద్రబాబు, లోకేష్ నాశనం కావడానికి భువనేశ్వరి కారణం: పోసాని కృష్ణమురళి

-

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం అంతా కూడా దీని చుట్టూనే తిరుగుతోంది. ఇక వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి తాజాగా చంద్రబాబు సతీమణి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.. భువనేశ్వరి అరెస్ట్ పై మాట్లాడుతూ.. ప్రజల ఆస్తులను తినే అంత వ్యక్తి నా భర్త చంద్రబాబు కాదని, అంత అవసరం కూడా లేదని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై పోసాని మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్ లు నాశనం కావడానికి ప్రధాన కారణం భువనేశ్వరి అని షాక్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు అంత నిజాయితీ పరుడు అయితే తనకు రాజకీయగా భిక్ష పెట్టిన కాంగ్రెస్ ను వదిలేసి టీడీపీలో ఎలా చేరారు.

అదే విధంగా పార్టీని ఇచ్చిన భువనేశ్వరి తండ్రి రామారావుపై చెప్పులతో కొట్టిస్తున్నా ? ఎందుకు ఇప్పటికే ఆమె భర్తను వెనకేసుకొని వస్తుంది అంటూ ప్రశ్నించారు పోసాని. ఇప్పటికీ భువనేశ్వరితో ఎటువంటి మార్పులు రాలేదంటూ పోసాని కృష్ణ మురళి కామెంట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version