గ్రేటర్ వార్ : తేజస్వి సూర్యను రంగంలోకి దింపనున్న బీజేపీ

హైదరాబాద్ లో గ్రేటర్ ఎన్నికల ను బిజెపి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏకంగా కేంద్ర మంత్రులను కూడా ప్రచారం కోసం పంపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ కేసీఆర్ ప్రభుత్వం మీద చార్జిషీట్లు కూడా రిలీజ్ చేసి వెళ్ళారు. ఇక ఒక పక్క బండి సంజయ్ మరో పక్క లక్ష్మణ్ మరో పక్క కిషన్ రెడ్డిలు విస్తృత పర్యటన చేస్తూ వీలైనంతగా జనాల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే రేపు జాతీయ రాజకీయాల్లో ఈ మధ్య ఎక్కువగా చురుగ్గా ఉంటున్నా కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య రేపు గ్రేటర్లో ప్రచారం చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు రేపు పలు డివిజన్లలో ఆయన ప్రచారంలో పాల్గొన్న ఉన్నట్టు బీజేపీ నుంచి సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఆయన బెంగళూరు సౌత్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.