ఈ రోజు గౌహతి వేదికగా జరుగుతున్న మూడవ టీ 20 మ్యాచ్ లో ఇండియా మరియు ఆస్ట్రేలియా గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. మొదటగా బ్యాటింగ్ చేసిన ఇండియా 222 పరుగులు చేయగా, గైక్వాడ్ సెంచరీ తో అలరించాడు. ఇక ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియాకు చెందిన ఆల్ రౌండర్ ఆరోన్ హార్డీ ఒక చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. తెలుస్తున్న వివరాల ప్రకారం ఆరోన్ హార్డీ ఈ మ్యాచ్ లో 4 ఓవర్లు బౌలింగ్ చేయగా కేవలం ఒక్క వికెట్ తీసుకుని 64 పరుగులు ఇచ్చుకున్నాడు. ఈ సమీకరణమ్ తో ఆస్ట్రేలియా తరపున టీ20 లలో ఒక బౌలర్ గా ఎక్కువ పరుగులు ఇచ్చిన రెండవ ప్లేయర్ గా హార్డీ చాలా చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇక ఇతనికన్నా ముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా సీనియర్ పేస్ బౌలర్ టై పేరు మీద ఉంది. టై ఇంతకు ముందు ఆస్ట్రేలియా తరపున 64 పరుగులు ఇచ్చుకున్నాడు.
ఇండియా ప్లేయర్ గైక్వాడ్ హార్డీ ను ఉతికి ఆరేశాడు… ప్రస్తుతం ఆస్ట్రేలియా ఛేదనలో 90 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది.