వామ్మో.. రష్మిక ఏడాది సంపాదన అన్ని కోట్లా..?

-

కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె నటించిన పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ దక్కించుకొని ఓవర్ నైట్ లోనే పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. దాంతో హిందీ సినిమాలలో ఆఫర్లు వెల్లువెట్టడంతో ప్రస్తుతం దక్షిణాది వైపు చూసే సమయమే ఈమెకు లేకుండా పోయిందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇకపోతే రష్మిక మందన్న తాజా ఆడిట్ ప్రకారం భారీగానే ఆస్తులు కూడబెట్టిందనే వార్తలు ముంబై మీడియా లో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి.

మరి రష్మిక నికర ఆస్తి విలువ విషయానికి వస్తే.. ప్రస్తుతం దక్షిణాదిలోనూ అటు ఉత్తరాదిన వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ సంపన్న నటుల జాబితాలో టాప్ స్థానానికి ఎగబాకిందని సమాచారం. ప్రస్తుతం ఆమె నికర ఆస్తుల విలువ సుమారుగా రూ.400 కోట్లకు పైగా ఉంటుందని తాజా సమాచారం. ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో మరొకసారి నితిన్ సరసన నటించడానికి అంగీకరించింది. ఒక్కో సినిమాకు రూ.3 కోట్ల మేర పారితోషకం అందుకునే ఈమె నిన్న ఐపీఎల్ 2023 ఆరంభ వేడుకలకు లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి సుమారుగా రూ. నాలుగున్నర కోటి అందుకున్నట్లు సమాచారం.

బ్రాండ్ ప్రమోషన్స్ వ్యాపార ప్రకటనలో కూడా కనిపిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటుంది. టాప్ బ్రాండ్స్ అంబాసిడర్ గా భారీ అవకాశాలు అందుకుంటుంది. అంతేకాదు ఇటీవల పలు కంపెనీలకు సంబంధించిన వ్యాపార ప్రకటనల్లో కూడా కనిపించిన ఈమెకు భారీగా ఆదాయం లభిస్తోందని సమాచారం. ప్రస్తుతం అటు సినిమాలు ఇటు వ్యాపార రంగాలు అటు సోషల్ మీడియా ద్వారా ఏడాదికి రూ. 125 కోట్లకు పైగానే ఆదాయం వస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా సౌత్ లోనే ఈ రేంజ్ లో ఆస్తులు కూడబెట్టిన హీరోయిన్గా ఈమె గుర్తింపు తెచ్చుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news