గుడ్​న్యూస్.. ​​ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు పెంపు

-

పేద, మధ్య తరగతి వారికి కేంద్రం శుభవార్త చెప్పింది. చిన్న మొత్తాల పథకాల్లో పొదుపు చేసుకునే వారికి తీపి కబురును అందించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్​-జూన్​ తొలి త్రైమాసికానికి చిన్నమొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను సవరించింది. సీనియర్‌ సిటిజన్ల పొదుపు పథకాలు, సుకన్య సమృద్ధి యోజన వంటి పలు పొదుపు పథకాల వడ్డీ రేట్లు మారనున్నాయి.

చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను 70 బేసిక్‌ పాయింట్ల వరకు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇవాళ్టి నుంచి కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి వస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించింది. మరోవైపు పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌, సాధారణ సేవింగ్స్‌ డిపాజిట్‌ వడ్డీ రేట్లలో ఎలాంటి సవరణలు చేయడంలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ శుక్రవారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో విడుదల చేసింది.

పథకం ప్రస్తుత వడ్డీ రేట్లు

(01.01.2023 నుంచి 31.03.2023)

కొత్త వడ్డీ రేట్లు

(01.04.2023 నుంచి 30.06.2023)

సేవింగ్స్​ డిపాజిట్​ 4.0 4.0
ఏడాది కాలపరిమితి డిపాజిట్​ 6.6 6.8
మూడేళ్ల కాలపరిమితి డిపాజిట్​ 6.8 6.9
ఐదేళ్ల కాలపరిమితి డిపాజిట్​ 6.9 7.0
ఐదేళ్ల రికరింగ్​ డిపాజిట్​ 5.8 6.2
సీనియర్ సిటిజన్​ సేవింగ్స్​ సర్టిఫికెట్​ 8.0 8.2
నెలవారీ ఇన్​కమ్​ అకౌంట్ స్కీమ్​ 7.1 7.4
నేషనల్​ సేవింగ్స్​ సర్టిఫికేట్​ 7.0 7.7
పబ్లిక్​ ప్రావిడెంట్ ఫండ్​ స్కీమ్​ 7.1 7.1
కిసాన్​ వికాస్​ పత్ర 7.2 7.5
సుకన్య సమృద్ధి యోజన 7.6 8.0

Read more RELATED
Recommended to you

Latest news