వామ్మో.. సీనియర్ ఎన్టీఆర్ అలవాట్లు మరీ ఇంత దారుణంగా ఉండేవా..?

-

చలనచిత్ర పరిశ్రమకు మూల స్తంభం లాంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇక సాంఘిక , పౌరాణిక, జానపద చిత్రాలకు పెట్టింది పేరుగా ఎన్టీఆర్ ఎన్నో మంచి మంచి చిత్రాలను తెరకెక్కించారు.. ఈయన కేవలం నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. ఇక నిర్మాతల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ కూడా నిర్మాతలను పారితోషకం విషయంలో ఇబ్బంది పెట్టేవారు కాదు.. ప్రేక్షకులను మెప్పించిన ఈయన .. తన అలవాట్లు చూస్తే మాత్రం మరీ ఇంత దారుణంగా ఉండేవా అని అనకమానరు. మరి సీనియర్ ఎన్టీఆర్ అలవాట్లూ ఏమిటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

సీనియర్ ఎన్టీఆర్ మొదటగా నటన మీద ఆసక్తి తో నాటక రంగం లోకి ప్రవేశించాడు . నాటకాలు వేస్తున్న సమయంలో తన మేనమామ కూతురు బసవతారకం ను పెద్దల కోరిక మేరకు వివాహం చేసుకున్నారు. ఇక ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలినాళ్లల్లో తన భార్య, పిల్లలతో కలిసి తెల్లవారుజామున మూడు గంటలకి బీచ్ కి వెళ్లేవారు. అక్కడ పిల్లలతో జానపద గేయాలు, తుమ్మెద పాటలు పాడిస్తూ తాను కూడా ఒక గంట సేపు అక్కడే వారు. ఇక తర్వాత ఇంటికి వచ్చి ఐదు గంటల సమయంలో ప్రతిరోజు వ్యాయామం తప్పకుండా చేసేవారు. తన కెరియర్ తొలినాల్లల్లో ఇలాగే చేసేవారు ఎన్టీఆర్.

ఇక తర్వాత నటుడిగా బిజీ అయిన ఎన్టీఆర్ సినిమాలతో తీరిక ఉండేది కాదు. వ్యాయామం, బీచ్ కి వెళ్లడం లాంటి పనులు మానేశాడు. ఇక ఎన్టీఆర్ కి నాటుకోడి అంటే చాలా ఇష్టమట. ఇక ఈ క్రమంలోనే ప్రతిరోజు ఒక కోడి మొత్తాన్ని తినేవారు అని ఆయన సన్నిహితులు చెబుతూ ఉండేవారు. టీ కూడా ఎక్కువగా ఇష్టం ఉండేదట. కానీ ఆయన తల్లి మరణించడంతో టీ తాగడం కూడా మానేశారు. సినీ పరిశ్రమ లోకి వచ్చిన తర్వాత స్వరం బాగుండాలన్న కారణం తో ఉదయం, సాయంత్రం చుట్ట కాల్చేవారు.. ఆ అలవాటుతోనే ఆ తర్వాత సిగరెట్ కాల్చడం కూడా నేర్చుకున్నారు కానీ కాలక్రమేణా ఆరోగ్య రీత్యా సిగరెట్ తాగడం మానేశారు ఎన్టీఆర్.

ఇక అప్పట్లో ఎన్టీఆర్ కిల్లి కూడా ఎక్కువగా వేసుకునేవారు. కానీ ఆర్టిస్టు లు కిల్లీలు వేసుకుంటే పళ్ళు గార పట్టి చూడడానికి అసహ్యంగా వుంటాయని దర్శకనిర్మాత ఎల్వి ప్రసాద్ చెప్పడంతో ఆ అలవాటును కూడా మానుకున్నారు. ప్రతి సోమవారం గౌరీ మాత కోసం.. శనివారం వెంకటేశ్వర స్వామి కోసం తప్పకుండా నేల మీద పడుకునే వారు ఎన్టీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news