వేరుశెనగ విత్తన ఎంపికలో రైతులు వీటిని తప్పక తెలుసుకోవాలి..

-

వేరుశెనగ పంట యాసంగి పంట..ఈ పంటను రాష్ట్రంలో అధిక విస్తీర్ణంలో పండిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో అనంతపురం, మహబూబ్ నగర్,కరీంనగర్‌, వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఎక్కువ విస్తీర్ణంలో సాగు అవుతుంది.ఈ పంట సాగుకు అనువైన తేలిక పాటి నేలలు మరి నేలలు మరియు తుంపర (స్ప్రింక్లర్ల) పద్ధతి ద్వారా సులువైన నీటి యాజమాన్యం వలన యాసంగిలో ఈ వేరుశనగ పంట యొక్క విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుంది..

విత్తె సమయం..

జులై మూడో వారంలో ఈ వేరుశెనగ పంటను విత్తడానికి అనువైన సమయం..తెలంగాణాలో సెప్టెంబర్ లో విత్తనాలను వేస్తారు.ఇసుకతో కూడిన గరప నేలలు లేదా నీరు త్వరగా ఇంకే ఎర్ర చల్కా నేలలు వేరుశనగ సాగుకు చాలా అనుకూలమైనవి. ఎక్కువ బంకమన్ను కలిగిన నల్లరేగడి నేలల్లో ఈ పంట వేయరాదు. విత్తే ముందు నేలను మెత్తగా దుక్కిచేసి చదును చేయాలి..

విత్తన శుద్ధి..

విత్తనానికి 1 గ్రా., టెబ్యుకొనజోల్ లేదా 3 గ్రా., మాంకోజెబ్ పొడి మందు పట్టించాలి. కాండం ఖరీ కుళ్ళు వైరస్ తెగులు ఆశించే ప్రాంతాలలో ఒక మి.లీ., ఇమిడాక్లోప్రిడ్ ను 7 మి.లీ. నీటిలో కలిపి ఒక కిలో విత్తనానికి పట్టించాలి.

వేరుపురుగు ఉధృతి ఎక్కువగా ఆశించే ప్రాంతాలలో 6.5 మి.లీ., క్లోరిపైరిఫాస్ తో విత్తన శుద్ధి చేసుకోవాలి. వరి మాగాణుల్లో లేక కొత్తగా వేరుశనగ సాగు చేసేటప్పుడు ఎకరాకు సరిపడే కిలో విత్తనానికి 200 గ్రా., రైజోబియం కల్చరుని పట్టించాలి. విత్తే పదు వేరుకుళ్ళు, మొదలు కుళ్ళు మరియు కాండము కుళ్ళు తెగుళ్ళు ఎక్కువగా ఆశించే పరిస్థితులలో కిలో విత్తనానికి విత్తుకోవా 10గ్రా. ట్రైకోడెర్మా విరిడిని పట్టించి విత్తితే ఎటువంటి తెగుల్లు సమస్యలు రావు..

విత్తనాల ఎంపిక..

గుత్తిరకాలలో 90-95% వరకు మరియు తీగ రకాల్లో 85-90 % మొలక శక్తి ఉండవలెను. మొలక శక్తి 85% కన్నా తక్కువ కలది తీసుకోకూడదు. సాధారణంగా విత్తనం కొరకు ఉంచిన వేరుశనగను, కాయల రూపంలో నిల్వచేసి విత్త ముందు గింజలను వేరు చేయవలెను. గింజలను వేరుచేసేటపుడు గింజపై పొర బాగా వుండి రంగు సమానంగా వున్న విత్తనాలను ఎన్నుకోవాలి..మొలక వచ్చిన విత్తనాలను లేదా పగిలిన విత్తనాలను వాడటం వల్ల మొలకలు రావు..ఇంకేదైనా  సందెహాలు ఉంటే దగ్గర లోని వ్యవసాయ నిపునులను అడిగి తెలుసుకోవాలి..

Read more RELATED
Recommended to you

Latest news