వామ్మో.. కివి పండుతో ఇన్ని ప్రయోజనాలా ..?

-

కివి.. దీన్ని వండర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. దాదాపు 27 రకాల పండ్లలలో లభించే పోషకాలు ఒక్క కివీ పండులో లభిస్థాయని చెప్పటంలో అతిశయోక్తి లేదు. నారంజ, బత్తాయి లాంటి పండ్ల కన్నా ఇందులో విటమిన్ సి రెట్టింపు మోతాదులో ఉంటుంది.యాపిల్ కంటే ఎక్కువ పోషకాలు ఇందులో కలిగి ఉంది. ఇందులో సి విటమిన్ తో పాటు విటమిన్ ఇ, పోటాషియం, ఫోలిక్ యాసిడ్స్ , యాంటీ ఆక్సిడెంట్ వంటి ఎన్నో పోషక పదార్థాలను కలిగి ఉంది.

బరువు తగ్గాలనుకునే వారికి కివీ పండు ఒక అద్భుత వరం.దీనిని తీసుకుంటే కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. అధిక బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.జీర్ణ వ్యవస్థను శుభ్రపరుస్తుంది.
కివీ పండు శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది శరీరంలో ఏర్పడే ఫ్రీరాడికల్స్ నుండి శరీరాన్ని రక్షిస్తుంది. రక్త నాలాలను మెరుగుపరుస్తుంది. రక్తనాళాల్లోనే రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది. ఇందులో ఉండే సోడియం రక్తపోటును తగ్గించి గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. రక్తంలోని షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. కివి పండులో పిండి పదార్థం అధికంగా ఉంటుంది. అందువల్ల ఇది మలబద్ధకాన్ని దూరం చేయడంలో ఎంతో దోహదపడుతుంది. మలబద్దకం తో బాధపడేవారు వారానికి ఒక్కసారైనా కివీ పండును తినడం మంచిది.

కివి క్యాన్సర్ రావడానికి కారణం అయ్యే కారకాలతో పోరాడుతుంది.క్యాన్సర్ కు కారణం అయ్యే జన్యుపరమైన మార్పులను నివారిస్తుంది.అంతే కాకుండా… ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని కొలెస్ట్రాల్ మరియు బీ.పీ ని అదుపులో ఉంచుతాయి. కంటిసంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. వయసు పెరుగుదల వల్ల వచ్చే కణాల క్షీణతను తగ్గిస్తాయి. గర్భణీ మహిళలలు కివీ పండును తీసుకోవడం చాలా మంచిది. కాబట్టి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ పండును కనీసం వారానికి ఒక్కసారైనా తీసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version