త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, బాలీవుడ్ స్టార్ తో పాన్ ఇండియా మూవీ.!

-

త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే ప్రేక్షకులతో పాటు టెక్నీషియన్ లో, దర్శకులలో కూడా ప్రత్యేక మైన అభిమానం సంపాదించుకున్నారు. అందరూ ఆయన్ని గురూజీ గా పిలుచుకుంటారు. సినిమా పరిశ్రమ లో చాలా మంది స్ట్రగుల్ లో ఉంటే ఆయనతో కొంత సమయం కేటాయిస్తే చాలు హాయిగా ఫీల్ అవుతారు. ఇక ఆయన పెన్ను పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇక తాను ఒక హీరో తో సినిమా చేస్తే మళ్లీ వారితోనే సినిమాలు రిపీట్ చేస్తూ ఉంటారు. ఇక మహేశ్ మూడు సినిమాలు, అల్లు అర్జున్ తో మూడు సినిమాలు, పవన్ కళ్యాణ్ తో మూడు సినిమాలు ఇలా వరసగా వారితోనే మార్చి మార్చి తీస్తూ ఉంటారు. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబు తో SSMB28 వర్కింగ్ టైటిల్ పై సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా తర్వాత నెక్స్ట్ మూవీ పై రక రకాలుగా వార్తలు వచ్చాయి.

ఇప్పుడు మరో న్యూస్ హల్చల్ చేస్తోంది.స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తర్వాతి సినిమా బన్నీతో  చేస్తున్నాడు అనేది దాని సారాశం.  ఇదే న్యూస్ ఐతే అంత కిక్ ఉండేది కాదు. మహేష్ బాబు బ సినిమా పూర్తి అయిన తర్వాత, త్రివిక్రమ్ బన్నీతోనే సినిమాని ప్లాన్ చేస్తున్నాడని.. 2023 సమ్మర్ తర్వాత ఈ సినిమా మొదలయ్యే అవకాశం ఉందని అలాగే ఈ సినిమా లో మరో బాలీవుడ్  స్టార్ హీరో కార్తీక్‌ ఆర్యన్‌ కూడా ఉండబోతున్నాడని ఇది పెద్ద పాన్ ఇండియా మూవీ అని ప్రచారం జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version