వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ 2023 లో భాగంగా ఆస్ట్రేలియా మరియు ఇండియా ల మధ్య భీకరంగా జరుగుతోంది. మూడవ రోజు ఆటలో ఇండియా కాస్త మెరుగైన స్థితిలో నిలుస్తుంది అనుకుంటున్న తరుణంలో వరుస వికెట్లు కోల్పోవడంతో మళ్ళీ కష్టాల్లో పడింది. రహానే మరియు శార్దూల్ ఠాకూర్ లు ఇండియాను సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్న సమయంలో కెమరూన్ గ్రీన్ అందుకున్న అద్భుతమైన క్యాచ్ కు అజింక్య రహానే బలి అయ్యాడు. లంచ్ తర్వాత సెషన్ లో ఘోరంగా ఇండియాకు దెబ్బేశారు ఆస్ట్రేలియా బౌలర్లు. ఇక ముఖ్యంగా అజింక్య రహానే సీనియర్లు అందరూ విఫలమైన వేళ క్రీజులో పాతుకుపోయి చక్కగా రాణించాడు.
చివరికి సెంచరీ కి మరో 11 పరుగుల దూరంలో అవుట్ అయ్యాడు. సెంచరీ కనుక చేసి ఉంటే చాల బాగుండేదని అభిమానులు అభిమానులు అభిప్రాయపడుతున్నారు.